News March 26, 2024

ఏం చేస్తారో చెప్పకుండా రెడ్‌బుక్ ఏంటి?: సజ్జల

image

AP: నారా లోకేశ్ రెడ్‌బుక్‌పై ప్రభుత్వ సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ‘ఆయన రెడ్‌బుక్ దేనికో అర్థం కావడం లేదు. ప్రజలకు ఏం చేస్తామో చెప్పకుండా ఈ బుక్ ఏంటి? ముందు ఆయన మంగళగిరిలో గెలవాలి కదా?’ అని ఎద్దేవా చేశారు. కాగా తమ పార్టీ కేడర్‌ను ఇబ్బంది పెట్టిన వైసీపీ నేతలు, పోలీసులు, చట్టాన్ని ఉల్లంఘించిన వారి పేర్లను ఈ బుక్‌లో రాస్తున్నట్లు లోకేశ్ గతంలో వెల్లడించారు.

Similar News

News December 16, 2025

సిరీస్ మధ్యలో బుమ్రా ఎందుకు ముంబై వెళ్లారు?

image

IND vs SA T20 సిరీస్ మధ్యలో జస్ప్రీత్ బుమ్రా జట్టు నుంచి తప్పుకోవడం వెనుక వ్యక్తిగత కారణాలున్నట్లు BCCI వెల్లడించింది. అత్యంత సన్నిహిత వ్యక్తి హాస్పిటల్‌లో చేరడంతో వెంటనే ముంబైకి వెళ్లాల్సి వచ్చిందని తెలిపింది. మూడో T20 టాస్ సమయంలో కెప్టెన్ సూర్యకుమార్ ఇదే విషయాన్ని స్పష్టం చేశారు. పరిస్థితి మెరుగుపడితే 4 లేదా 5వ మ్యాచ్‌కు బుమ్రా తిరిగి జట్టులో చేరే అవకాశం ఉందని BCCI అధికారి తెలిపారు.

News December 16, 2025

25 లక్షలు దాటిన శబరిమల దర్శనాలు

image

కేరళలోని శబరిమల ఆలయానికి భక్తులు పోటెత్తుతున్నారు. అయ్యప్ప స్వాముల శరణు ఘోషతో శబరిమల మారుమోగుతోంది. నవంబర్ 16 నుంచి నిన్నటి వరకు రికార్డు స్థాయిలో 25+ లక్షల మంది దర్శించుకున్నారని అధికారులు తెలిపారు. గతేడాది ఇదే సమయానికి ఈ సంఖ్య 21 లక్షలుగా ఉన్నట్లు చెప్పారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పటిష్ఠ ఏర్పాట్లు చేసినట్లు వెల్లడించారు. కాగా మండల పూజా మహోత్సవాలు ఈ నెల 27తో ముగియనున్నాయి.

News December 16, 2025

జింకు ఫాస్పేట్‌ ఎరతో ఎలుకల నివారణ

image

ఎలుకల వల్ల పంట నష్టం ఎక్కువగా ఉంటే పంట కాలంలో ఒక్కసారి మాత్రమే జింకు ఫాస్పేట్ ఎరను వాడాలి. దీనికి ముందుగా విషం లేని ఎరను 20 గ్రాములు (98శాతం నూకలు, 2శాతం నూనె) పొట్లాలుగా చేసి ఎలుక కన్నానికి ముందు ఒకటి చొప్పున ఉంచాలి. ఇలా ఎలుకకు 2 రోజులు అలవాటు చేసి 3వరోజు జింకు ఫాస్పేట్ ఎరను 10 గ్రాములు (96% నూకలు, 2% నూనె, 2% మందు) పొట్లాలుగా కట్టి ఎలుక కన్నంలో ఒకటి చొప్పున వేయాలి. ఇవి తిన్న ఎలుకలు మరణిస్తాయి.