News October 5, 2024
రివర్స్ టెండరింగ్ అంటే ఏమిటి?

ఏదైనా ప్రాజెక్టుకు ఖరారైన కాంట్రాక్ట్‌కు మళ్లీ టెండర్లు పిలవడాన్ని రివర్స్ టెండరింగ్ అంటారు. మొదటిసారి పిలిచిన టెండర్లలో అవకతవకలు జరగడం లేదా ఆ పనిని మరింత చౌకగా చేయడానికి అవకాశం ఉందని తేలితే రివర్స్ టెండరింగ్‌కు పిలుస్తారు. జాతీయ స్థాయిలో NTPC, కోల్ ఇండియా, సోలార్ పవర్ కార్పొరేషన్ అమలు చేస్తున్న ఈ విధానాన్ని YCP ప్రభుత్వం తొలిసారి ఏపీలో తీసుకొచ్చింది. దాన్ని కూటమి సర్కార్ రద్దు చేసింది.
Similar News
News January 23, 2026
కోడి పిల్లలను వదిలాక షెడ్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు

కోళ్ల షెడ్లో ప్రతి 50 కోడి పిల్లలకు ఒక మేత తొట్టి, నీటి తొట్టి అమర్చాలి. తొలి వారంలో 50 పిల్లలకు 24 అంగుళాల మేత తొట్టి సరిపోతుంది. ప్రతి బ్రూడరు కింద 3-4 నీటి తొట్లను అమర్చాలి. వాటిని రోజూ శుభ్రపరచి నీటితో నింపాలి. కోడి పిల్లలను ఉంచిన షెడ్లో రాత్రంతా లైట్లను ఆన్‌లో ఉంచాలి. కోడి పిల్లలకు తొలి 7-10 రోజుల మధ్య ముక్కును కత్తిరిస్తే అవి ఒకదానినొకటి పొడుచుకోవడం, తొట్లలో మేతను కిందకు తోయడం తగ్గుతుంది.
News January 23, 2026
రాత్రిపూట ఎంగిలి పాత్రలను అలాగే వదిలేస్తున్నారా?

రాత్రి భోజనం తర్వాత అంట్లు తోమకుండా వంటగదిలో అలాగే వదిలేయడం వాస్తు రీత్యా చాలా అశుభం. ఉదయం లేవగానే మురికి పాత్రలను చూడటం వల్ల ఇంట్లోకి ప్రతికూల శక్తి ప్రవేశిస్తుంది. తద్వారా దరిద్రం, పేదరికం రావొచ్చని శాస్త్రాలు హెచ్చరిస్తున్నాయి. ఎంగిలి పాత్రల వల్ల లక్ష్మీదేవి ఆ ఇంట్లో నిలవదు. అందుకే వీలైనంత వరకు రాత్రే వంటగదిని, పాత్రలను శుభ్రం చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఇంట్లో ప్రశాంతత, సంపద పెరుగుతాయి.
News January 23, 2026
ఖలిస్థానీల దుశ్చర్య.. త్రివర్ణ పతాకం తొలగింపు

క్రొయేషియాలో భారత రాయబార కార్యాలయంలోకి ఖలిస్థానీ మూకలు చొరబడ్డాయి. జాగ్రెబ్‌లోని ఎంబసీపై ఉన్న భారత త్రివర్ణ పతాకాన్ని తొలగించాయి. ఆ స్థానంలో ఖలిస్థానీ జెండాను ఎగురవేశాయి. ఈ దుశ్చర్యను భారత విదేశాంగ శాఖ తీవ్రంగా ఖండించింది. ఈ ఘటనకు కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అక్కడి ప్రభుత్వాన్ని కోరింది.


