News September 29, 2024

IPL.. వేలంలో RTM ఆప్షన్ ఏంటి?

image

IPL మెగా వేలానికి ముందు RTM(రైట్ టు మ్యాచ్) <<14222929>>ఆప్షన్‌ను <<>>BCCI తీసుకొచ్చింది. దీని ప్రకారం ఉదాహరణకు SRHకు చెందిన ట్రావిస్ హెడ్ కోసం RCB రూ.12 కోట్లకు వేలం పాడితే, SRHను RTM కోసం అడుగుతారు. ఈ ఆప్షన్ ద్వారా రూ.12 కోట్లు చెల్లించి హెడ్‌ను SRH తిరిగి పొందవచ్చు. ఒకవేళ RCB రూ.16 కోట్లు చెల్లించేందుకు బిడ్ దాఖలు చేస్తే SRH ఆ మొత్తం చెల్లించాల్సి ఉంటుంది. లేదంటే అతడిని వదులుకోవాల్సి ఉంటుంది.

Similar News

News September 19, 2025

సెప్టెంబర్ 19: చరిత్రలో ఈరోజు

image

✒ 1887: రచయిత, నాస్తికుడు తాపీ ధర్మారావు జననం
✒ 1911: కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత బోయి భీమన్న జననం
✒ 1924: నిజాం వ్యతిరేక పోరాటయోధుడు కాటం లక్ష్మీనారాయణ జననం
✒ 1960: భారత్-పాక్ మధ్య సింధు జలాల ఒప్పందం(ఫొటోలో)
✒ 1977: క్రికెటర్ ఆకాశ్ చోప్రా జననం
✒ 1965: నాసా వ్యోమగామి సునీతా విలియమ్స్ జననం

News September 19, 2025

అఫ్గానిస్థాన్‌పై శ్రీలంక విజయం

image

ఆసియా కప్: అఫ్గానిస్థాన్‌పై శ్రీలంక 6 వికెట్ల తేడాతో గెలిచింది. తొలుత బ్యాటింగ్ చేసిన అఫ్గాన్ జట్టు 169-8 రన్స్ చేసింది. AFG బ్యాటర్లలో నబి(60), SL బౌలర్లలో తుషారా 4 వికెట్లతో రాణించారు. లంక ఓపెనర్ కుశాల్ మెండిస్(74) చెలరేగడంతో 170 పరుగుల లక్ష్యాన్ని సునాయాసంగా ఛేదించారు. AFG బౌలర్లలో ముజీబ్, అజ్మతుల్లా, నబి, నూర్‌ తలో వికెట్ తీశారు. లంక సూపర్ 4కు క్వాలిఫై అవ్వగా.. AFG టోర్నీ నుంచి ఎలిమినేటైంది.

News September 19, 2025

పుట్టినరోజు శుభాకాంక్షలు

image

ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.