News September 26, 2024

సనాతన ధర్మం అంటే ఏంటి?

image

సనాతనం అంటే శాశ్వతమైన, పవిత్రమైన, స్థిరమైన అని అర్థం. సనాతన ధర్మం అంటే శాశ్వతంగా నిలిచే ధర్మం అని పండితులు చెబుతారు. హిందువులు తమను తాము సనాతన వాదులుగా పిలుచుకుంటారు. అంటే శాశ్వతమైన ధర్మాన్ని అనుసరించేవారని అర్థం. హిందూ ధర్మానికి అసలు పేరు సనాతన ధర్మం అని ప్రవచనకర్తలు నిర్వచిస్తారు. ‘హిందూ’ అనే పదం భౌగోళిక గుర్తింపు కారణంగా విదేశీయుల నుంచి వచ్చిందని సద్గురు చెబుతారు.

Similar News

News January 26, 2026

దక్షిణాదికి పెరిగిన ప్రాధాన్యం

image

131 పద్మ పురస్కారాల్లో 41 దక్షిణాదికే దక్కాయి. 15 అవార్డులతో మహారాష్ట్ర అగ్రస్థానంలో నిలవగా, తమిళనాడు 13తో రెండో స్థానంలో ఉంది. కేరళకు 8 మాత్రమే వచ్చినా 5 పద్మ విభూషణ్‌లలో 3 మలయాళీలకే వెళ్లాయి. కేంద్రంలో (AP-4, TG-7, కర్ణాటక-8) సౌత్ ఇండియాకు పెరిగిన ప్రాధాన్యాన్ని ఇది స్పష్టంగా చూపిస్తోందని BJP శ్రేణులు అంటున్నాయి. అయితే TN, KLలో ఈ వేసవిలో అసెంబ్లీ ఎన్నికలున్నాయని విశ్లేషకులు గుర్తుచేస్తున్నారు.

News January 26, 2026

తల్లిపాలు ఎలా మాన్పించాలంటే..!

image

శిశువు ఆరోగ్యానికి తల్లిపాలు ఎంతో ముఖ్యం. కానీ వయసు పెరుగుతున్నా కొందరు పిల్లలు పాలు మానరు. దీనికోసం ఒకేసారి మాన్పించకుండా పాలు ఇచ్చే వ్యవధి తగ్గిస్తుండాలి. లేదంటే వారు అనారోగ్యానికి గురయ్యే అవకాశం ఉంది. పిల్లలకు కడుపునిండా ఆహారాన్ని ఇవ్వాలి. ఏడాది తర్వాత నుంచి ఘన పదార్థాలు అలవాటు చెయ్యాలి. ఆరోగ్యకరమైన చిరుతిళ్లు ఇవ్వడం, పాలు అడిగినప్పుడు వారిని డైవర్ట్ చేయడం వల్ల నెమ్మదిగా మానేస్తారు.

News January 26, 2026

బంగారం ధర.. ఆల్ టైమ్ రికార్డు

image

ఇంటర్నేషనల్ మార్కెట్‌లో చరిత్రలో తొలిసారి ఔన్స్ (28.35గ్రా) బంగారం $5,000కి (₹4.59L) చేరింది. ఒక ఔన్స్ సిల్వర్ $100గా ఉంది. 2025లో గోల్డ్ రేట్ 60%, వెండి 150% పెరిగినట్లు మార్కెట్ వర్గాలు తెలిపాయి. US-NATO, ఇరాన్, గ్రీన్లాండ్ టెన్షన్స్, ట్రంప్ టారిఫ్స్ వంటివి దీనికి కారణాలుగా చెబుతున్నాయి. 2026 చివరికి బంగారం ఔన్స్ $5,400కి చేరొచ్చని అంచనా. ఈ పెరుగుదల భారత్ సహా ఇతర మార్కెట్లపైనా ప్రభావం చూపనుంది.