News August 15, 2024
ఏంటీ లౌకిక పౌరస్మృతి?

కులం, మతం, ప్రాంతంతో సంబంధం లేకుండా అందరికీ ఒకే చట్టం ఉండాలన్నదే ఉమ్మడి పౌరస్మృతి (UCC) లక్ష్యం. దేశంలో మతాలను బట్టి వ్యక్తిగత చట్టాలు ఉన్నాయి. పెళ్లి, విడాకులు, వారసత్వం, దత్తత, నిర్వహణ వీటి కిందకి వస్తాయి. ఉదా: కొన్ని మతాల్లో బహు భార్యత్వం అమల్లో ఉంది. విడాకులకు కోర్టుతో సంబంధం లేదు. మత విద్య, మెజారిటీ మైనారిటీ వ్యత్యాసం ఉన్నాయి. వీటిపై విమర్శల వల్లే <<13857660>>లౌకిక పౌరస్మృతి<<>> అవసరమని మోదీ అన్నారు.
Similar News
News November 27, 2025
‘బాయిలోనే బల్లి పలికే’ సాంగ్పై కామెంట్స్.. SRనగర్లో ఫిర్యాదు

సింగర్ మంగ్లీ తన తాజా పాట ‘బాయిలోనే బల్లి పలికే’పై జనాదరణ పొందింది. అటువంటి పాట మీద ఓ వ్యక్తి అసభ్యకరంగా, కించపరిచే విధంగా కామెంట్స్ చేశాడంటూ SRనగర్ PSలో ఆమె ఫిర్యాదు చేశారు. సదరు వ్యక్తి తన పాటనే కాకుండా, జాతిని ఉద్దేశిస్తూ నీచంగా మాట్లాడారని ఫిర్యాదులో స్పష్టం చేశారు. ఓ వర్గాన్ని కించపరిచిన ఆ వ్యక్తిని శిక్షించాలని పోలీసులను మరోవైపు కొందరు నాయకులు సైతం డిమాండ్ చేస్తున్నాయి.
News November 27, 2025
NIT వరంగల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు

<
News November 27, 2025
పంచాయతీ ఎన్నికలు.. జీవో నం.46 అంటే ఏంటి?

TG: స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ కోసం రాష్ట్ర ప్రభుత్వం నవంబర్ 22న జీవో నం.46ను తీసుకొచ్చింది. దీని ప్రకారం ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్లు కలిపి గరిష్ఠంగా 50 శాతం మించకూడదు. దీని ప్రకారం బీసీలకు 22% రిజర్వేషన్లు మాత్రమే దక్కుతాయని బీసీ సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఈ జీవోను <<18402975>>సవాల్ చేస్తూ హైకోర్టులో<<>> పలువురు పిటిషన్లు దాఖలు చేశారు. దీనిపై రేపు విచారణ జరగనుంది.


