News January 25, 2025
ఫైనాన్సియల్ ర్యాంకింగ్స్లో తెలంగాణ స్థానమిదే!

2022- 23 ఏడాదికి సంబంధించి నీతి ఆయోగ్ ఫైనాన్సియల్ ర్యాంకింగ్స్ విడుదల చేసింది. మొత్తం 18 రాష్ట్రాలకు ర్యాంకులు ఇచ్చింది. అందులో భాగంగా ఫిస్కల్ హెల్త్ ఇండెక్స్(ఏడాది ఆర్థిక ఆరోగ్య సూచిక)లో తెలంగాణ(43.6స్కోర్) 8వ స్థానంలో నిలిచింది. తొలిస్థానం ఒడిశా(67.8)కు దక్కింది. అటు ఏపీ 17వ స్థానంలో నిలిచింది. మరోవైపు, రెవెన్యూ మొబిలైజేషన్లో 75.2 స్కోర్తో రాష్ట్రం 2వ, అప్పుల సూచిలో 8వ ప్లేస్లో ఉంది.
Similar News
News December 9, 2025
రేపు ఉద్యోగులతో పవన్ మాటామంతీ

AP: పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ఉద్యోగులతో డిప్యూటీ సీఎం పవన్ రేపు ప్రత్యేకంగా మాట్లాడనున్నారు. మంగళగిరిలోని ఓ కన్వెన్షన్లో ఈ కార్యక్రమం జరగనుంది. ఉద్యోగుల సంక్షేమం కోసం ప్రభుత్వం అమలు చేస్తోన్న కార్యక్రమాలను ఆయన వారికి వివరిస్తారు. అలాగే ఎలాంటి విధానాలు పాటిస్తే గ్రామీణ ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించగలమో తెలుసుకోనున్నారు. అవినీతిరహిత పాలనను అందించేందుకు సహకరించాలని కోరనున్నారు.
News December 9, 2025
టీ20ల్లో మనదే డామినేషన్.. కానీ!

టీ20ల్లో ఓవరాల్గా దక్షిణాఫ్రికాపై టీమ్ ఇండియా డామినేషన్ కొనసాగుతోంది. ఇప్పటివరకు ఇరు జట్ల మధ్య 31 T20 మ్యాచులు జరగగా భారత్ 18, SA 12 మ్యాచుల్లో విజయం సాధించాయి. ఒక మ్యాచులో ఫలితం రాలేదు. అయితే సొంతగడ్డపై ఆడిన 12 మ్యాచుల్లో ఇండియా ఐదింట్లో నెగ్గగా దక్షిణాఫ్రికా ఆరు మ్యాచుల్లో గెలిచింది. మరో మ్యాచ్లో రిజల్ట్ రాలేదు. కాగా కటక్లో ఆడిన రెండు టీ20ల్లో దక్షిణాఫ్రికానే విజయం సాధించడం గమనార్హం.
News December 9, 2025
ఎర్లీ ప్యూబర్టీ ఎందుకొస్తుందంటే?

పిల్లలు త్వరగా యవ్వన దశకు చేరుకోవడానికి అనేక కారణాలు ఉన్నాయంటున్నారు నిపుణులు. కుటుంబ చరిత్ర, ఆహారపు అలవాట్లు, అధికబరువు, కొన్ని రకాల కాస్మెటిక్స్, సబ్బులు, డిటర్జెంట్లలో ఉండే పారాబెన్స్, ట్రైక్లోసాన్, ఫ్తాలేట్స్ వంటి రసాయనాలు హార్మోన్ల పనితీరును దెబ్బతీస్తాయి. ఇలా కాకుండా ఉండాలంటే ఇంట్లో వండిన ఆహారాన్నే తినడం, రసాయనాల వాడకాన్ని తగ్గించడం, ఆరోగ్యకరమైన జీవనశైలిని పాటించడం మంచిదని సూచిస్తున్నారు.


