News October 30, 2025
అపమృత్యు భయం పోవడానికి ఏ అభిషేకం..?

కార్తీక మాసంలో శివాలయాలకు భక్తులు పోటెత్తుతారు. ఆయనకు అభిషేకాలు చేస్తే శుభాలు కలుగుతాయని నమ్ముతారు. అయితే ఒక్కో అభిషేకంతో ఒక్కో ఫలితముంటుందని పండితులు చెబుతున్నారు. అపమృత్యు భయం పోవడానికి నువ్వుల నూనె అభిషేకం ఉత్తమం అంటున్నారు. ఫలితంగా అకాల మరణ భయం దరిచేరదని పేర్కొంటున్నారు. ‘నువ్వుల నూనె శని దేవునికి ప్రీతిపాత్రమైనది. శివుడిని ఈ నూనెతో అభిషేకిస్తే అన్ని ఆటంకాలు తొలగిపోతాయి’ అని సూచిస్తున్నారు.
Similar News
News October 30, 2025
అయోధ్య రామునికి రూ.3వేల కోట్ల విరాళం

అయోధ్యలో రామ మందిరం కోసం 2022 నుంచి ఇప్పటి వరకు రూ.3వేల కోట్లకుపైగా విరాళాలు అందాయి. ఇందులో దాదాపు రూ.1,500 కోట్లను నిర్మాణం కోసం ఖర్చు చేసినట్లు రామమందిర నిర్మాణ కమిటీ ఛైర్మన్ నృపేంద్ర మిశ్రా వెల్లడించారు. నవంబర్ 25న ఆలయంలో జరిగే జెండా ఆవిష్కరణ వేడుకకు ప్రధాని మోదీ ముఖ్య అతిథిగా హాజరవుతారని తెలిపారు. ఈ కార్యక్రమానికి మరో 8 వేల మందిని ఆహ్వానించనున్నట్లు చెప్పారు.
News October 30, 2025
APPLY NOW: MGAHVలో ఉద్యోగాలు

మహాత్మాగాంధీ అంతర్ రాష్ట్రీయ హిందీ విశ్వవిద్యాలయం 23 ఉద్యోగాలకు దరఖాస్తులు కోరుతోంది. వీటిలో ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు ఉన్నాయి. అర్హతగల అభ్యర్థులు నవంబర్ 10 వరకు అప్లై చేసుకోవచ్చు. మరింత సమాచారం కోసం https://hindivishwa.org/ వెబ్‌సైట్‌ను సంప్రదించవచ్చు.
News October 30, 2025
గుమ్మడి కాయలను ఎప్పుడు కోస్తే ఎక్కువ కాలం నిల్వ ఉంటాయి?

గుమ్మడి పంట నాటిన 75 నుంచి 80 రోజులకు గుమ్మడి తీగపై కాయలు ఏర్పడతాయి. లేత కాయలు త్వరగా చెడిపోతాయి. కాబట్టి బాగా ముదిరి, పండిన కాయలనే కోయాలి. ముదిరిన కాయలు 4 నుంచి 6 నెలల వరకు నిల్వ ఉంటాయి. కాబట్టి ఎంత దూరపు మార్కెట్‌కైనా సులభంగా తరలించవచ్చు. కాయల్ని తొడిమతో సహా కోసి, కొన్ని రోజుల పాటు ఆరనివ్వాలి. కోసిన కాయలను శుభ్రపరచి సైజులను బట్టి గ్రేడింగ్ చేసి మార్కెట్‌కు పంపాలి.


