News October 15, 2024

ఎన్నికల్లో ఉచిత హామీలతో లాభమేంటి?

image

అధికారంలోకి రావడానికి రాజకీయ పార్టీలకు సులభంగా దొరికిన అస్త్రం ‘ఉచితం’. ఏ దేశమైనా ఎదగాలంటే ప్రాజెక్టులు, ఇన్ఫ్రా, రోడ్ల నిర్మాణం, ఉపాధి కల్పనకు ప్రోత్సాహకాల వంటివి ప్రకటించాలి. ఇందుకు భిన్నంగా బస్సుల్లో ఫ్రీ, కరెంటు ఫ్రీ, అకౌంట్లలోకి డబ్బుల బదిలీతో రాష్ట్ర ఖజానాలు ఖాళీ అవ్వడం చూస్తూనే ఉన్నాం. ఫ్రీబీస్‌పై అభిప్రాయం కోరుతూ కేంద్రం, ECIకి సుప్రీంకోర్టు తాజాగా నోటీసులిచ్చింది. దీనిపై మీ కామెంట్?

Similar News

News January 1, 2026

ఎస్సీలకు శుభవార్త.. వడ్డీ మాఫీ, కొత్త లోన్లు

image

AP: ఎస్సీలకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. స్వయం ఉపాధి పథకాల కింద SC యువత తీసుకున్న రుణాలపై వడ్డీ మాఫీ చేసింది. దీంతో 11,479 మందికి ఊరట కలగనుంది. మరోవైపు SC కార్పొరేషన్, సెర్ప్ ఆధ్వర్యంలో 4,400 మందికి రాయితీ రుణాలు ఇవ్వనుంది. ఈ నెలాఖరు కల్లా లబ్ధిదారులను ఎంపిక చేయనుంది. ₹50వేల వరకు రాయితీ ఇచ్చి, మిగతా మొత్తాన్ని వడ్డీలేని రుణంగా ఇవ్వనుంది. ఇందుకు ప్రభుత్వం ₹63.26 కోట్లు రిలీజ్ చేసింది.

News January 1, 2026

ఫుల్ కిక్కు.. 4 రోజుల్లో రూ.1,230కోట్ల మద్యం అమ్మకాలు

image

TG: కొత్త ఏడాదికి ముందు 4 రోజుల్లోనే(28,29,30,31) రూ.1,230 కోట్ల మద్యం అమ్మకాలు జరిగినట్లు ఎక్సైజ్ శాఖ అధికారులు తెలిపారు. డిసెంబర్ నెలలో మొత్తంగా రూ.5వేల కోట్ల మద్యం సేల్స్ జరిగాయని పేర్కొన్నారు. సర్పంచ్ ఎన్నికలు, కొత్త మద్యం పాలసీ అమల్లోకి రావడమూ కారణమని చెబుతున్నారు. ఒక్క నెలలో ఈ స్థాయిలో అమ్మకాలు జరగడం రికార్డు కాగా, 2023 డిసెంబర్‌లో రూ.4,291 కోట్ల అమ్మకాలు జరిగాయి.

News January 1, 2026

ఈ దశలో మామిడికి తప్పక నీరు అందించాలి

image

తెలుగు రాష్ట్రాల్లోని కొన్ని రకాల మామిడి చెట్లలో ఇప్పటికే పూమొగ్గలు కనిపిస్తున్నాయి. ఇలా పూమొగ్గలు ఏర్పడి, అవి పెరుగుదల దశలో ఉన్నప్పుడు తేలికపాటి నీటి తడి ఇవ్వాలని వ్యవసాయ నిపుణులు సూచిస్తున్నారు. అలాగే పిందె ఏర్పడిన తర్వాత (బఠాణి గింజ సైజులో ఉన్నప్పుడు), ప్రతి 15-20 రోజులకు ఒకసారి నీటి తడులు ఇవ్వాలని చెబుతున్నారు. రైతులు ఈ విషయంలో జాగ్రత్తగా ఉండి వ్యవసాయ నిపుణుల సూచనలు తీసుకోవాలి.