News October 7, 2025

కనకాంబరం పూల సేకరణకు అనువైన సమయం ఏది?

image

తెలుగు రాష్ట్రాల్లో కనకాంబరం సాగు పెరిగింది. ఈ మొక్కలు నాటిన 2 నుంచి 3 నెలలకు పూత ప్రారంభమై, ఏడాది పొడవునా పూలు పూస్తాయి. జూన్ నుంచి జనవరి వరకు దిగుబడి ఎక్కువగా, వర్షాకాలంలో దిగుబడి కొద్దిగా తగ్గుతుంది. కనకాంబరం పూలను సరైన సమయంలో సేకరిస్తే అవి తాజాగా ఉండి మంచి ధర వస్తుంది. కనకాంబరం పూర్తిగా విచ్చుకోవడానికి రెండు రోజులు పడుతుంది. కాబట్టి రోజు విడిచి రోజు ఉదయం లేదా సాయంత్రం వేళల్లో పూలు కోయాలి.

Similar News

News October 7, 2025

సీనియర్ నేతలతో సీఎం రేవంత్ సుదీర్ఘ చర్చ

image

TG: జూబ్లీహిల్స్‌లోని తన నివాసంలో కాంగ్రెస్ సీనియర్ నేతలతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశం సుదీర్ఘంగా కొనసాగుతోంది. బీసీ రిజర్వేషన్లపై రేపు హైకోర్టులో తీర్పు వ్యతిరేకంగా వస్తే ఎలా ముందుకు వెళ్లాలనే దానిపై చర్చిస్తున్నట్లు సమాచారం. అటు జూబ్లీహిల్స్ ఉపఎన్నిక అభ్యర్థి ఎంపికపైనా సీఎం సమాలోచనలు జరుపుతున్నారు.

News October 7, 2025

ఇతిహాసాలు క్విజ్ – 28 సమాధానాలు

image

1. రాముడు పాలించినప్పుడు కోసల దేశపు రాజధాని ‘అయోధ్య’.
2. కురుక్షేత్రంలో కర్ణుడి రథసారథి శల్యుడు.
3. భగవద్గీతలో మొత్తం 18 అధ్యాయాలు ఉన్నాయి.
4. వేంకటేశ్వర స్వామితో పాచికలు ఆడింది హథీరాం బావాజీ.
5. తెలంగాణలో బోనాల పండుగను ఆషాడ మాసంలో జరుపుకొంటారు.
<<-se>>#Ithihasaluquiz<<>>

News October 7, 2025

TDPతో పొత్తు వద్దు: నడ్డాకు BJP నేత రహస్య లేఖ

image

జూబ్లీహిల్స్‌లో TDPతో పొత్తు సమీకరణాలపై TBJPలో భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. సుహాసినికి చంద్రబాబు కూటమి టికెట్ ఇప్పిస్తారనే ప్రచారంపై ఓ ముఖ్య నేత JP నడ్డాకు లేఖ రాశారని విశ్వసనీయ సమాచారం. ఈ పొత్తుతో రేవంత్‌కు AP CM లాభం చేకూర్చారనే సంకేతాలు ప్రజల్లోకి వెళ్తాయని, ఈ పరిణామం తెలంగాణలో BJP వృద్ధికి అడ్డుగా ఉండొచ్చని ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికే BJP-PCC ఒకటని BRS ఆరోపిస్తుండటం తెలిసిందే.