News August 3, 2024

మోదీ చెప్పిన ‘కృషి పరాశర’ గ్రంథం ఏంటి?

image

వ్యవసాయంపై పరాశర మహర్షి 2000 ఏళ్ల క్రితమే <<13767183>>‘కృషి’ <<>>గ్రంథం రాశారు. కృషికి సేద్యమని అర్థం. ఇందులో వివిధ ఛందస్సుల్లో 240 శ్లోకాలు ఉన్నాయి. ఏయే మాసాల్లో ఎంత వర్షం కురుస్తుంది, భూమిని ఎప్పుడు, ఏ మేరకు, ఎలా చదును చేయాలి, విత్తనాలు ఎలా సేకరించాలి, ఎలా విత్తుకోవాలి, సస్య రక్షణ, ఎరువుల వాడకం, ఆవులు, గేదెలు సహా జీవాలను ఉపయోగించుకోవడం, వాటిపై పనిభారం, పంట కోత, పంట మార్పిడి, భూమి నిర్వహణ అంశాలను వివరించారు.

Similar News

News November 17, 2025

ఒకే కుటుంబంలో 18 మంది మృతి

image

సౌదీలో ఘోర <<18310005>>బస్సు<<>> ప్రమాదం HYDలో పెను విషాదాన్ని నింపింది. మృతులంతా HYD వాసులే కాగా రాంనగర్‌లోని నసీరుద్దీన్ ఫ్యామిలీకి చెందిన 18 మంది మరణించడం తీవ్రంగా కలిచివేస్తోంది. నసీరుద్దీన్ 18 మంది కుటుంబ సభ్యులతో కలిసి ఉమ్రా యాత్రకు వెళ్లారు. ఆయన కుమారుడు సిరాజుద్దీన్ మాత్రం ఉద్యోగరీత్యా USలో ఉంటున్నాడు. ఇప్పుడు ఆ ఫ్యామిలీలో అతనొక్కడే మిగిలాడని వారి బంధువులు Way2Newsకు వెల్లడించారు.

క్యాబినెట్ భేటీ ప్రారంభం

image

తెలంగాణ క్యాబినెట్ సమావేశం ప్రారంభమైంది. ప్రజాకవి అందెశ్రీకి మంత్రి మండలి సంతాపం తెలిపింది. ఈనెల 24లోపు ఎన్నికల షెడ్యూల్ విడుదల చేయాలని హైకోర్టు ఆదేశించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇవాళ్టి భేటీలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై కీలక నిర్ణయం తీసుకునే అవకాశముంది.