News July 30, 2024
ITR డెడ్‌లైన్ పొడిగింపుపై కేంద్రం ఏమందంటే?
ITR నమోదుకు డెడ్‌లైన్ పొడిగించనున్నట్లు జరుగుతున్న ప్రచారాన్ని కేంద్ర ప్రభుత్వం ఖండించింది. అందులో వాస్తవం లేదంది. 2023-24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ITR జులై 31లోపు కచ్చితంగా దాఖలు చేయాల్సిందేనని స్పష్టం చేసింది. <<13680892>>పెనాల్టీలు<<>> పడకుండా ఉండాలంటే గడువులోగా ITR ఫైల్ చేసుకోవాలని సూచించింది. జులై 26 వరకు 5కోట్లకు పైగా ITRలు నమోదైనట్లు తెలిపింది.
Similar News
News February 1, 2025
కేంద్ర బడ్జెట్.. కేటాయింపులు
☞ వ్యవసాయం, అనుబంధ రంగాలు రూ.1.71లక్షల కోట్లు
☞ విద్య- రూ.1.28 లక్షల కోట్లు
☞ ఆరోగ్యం-రూ.98,311 కోట్లు
☞ పట్టణాభివృద్ధి-రూ.96,777 కోట్లు
☞ ఐటీ, టెలికం-రూ.95,298 కోట్లు
☞ విద్యుత్- రూ.81,174 కోట్లు
☞ వాణిజ్యం, పరిశ్రమలు- రూ.65,553 కోట్లు
☞ సామాజిక సంక్షేమం-రూ.60,052 కోట్లు
News February 1, 2025
కేంద్ర బడ్జెట్‌పై సీఎం చంద్రబాబు ఏమన్నారంటే?
AP: కేంద్ర బడ్జెట్‌ను CM చంద్రబాబు స్వాగతించారు. వార్షికాదాయం రూ.12లక్షల వరకు పన్ను మినహాయింపు ఇవ్వడం గొప్ప పరిణామం అని చెప్పారు. PM మోదీ వికసిత్ భారత్ దార్శనికతను బడ్జెట్ ప్రతిబింబిస్తోందన్నారు. పేదలు, మహిళలు, రైతుల సంక్షేమానికి ప్రాధాన్యతనిచ్చారని తెలిపారు. రాబోయే ఐదేళ్లలో వృద్ధికి 6 కీలక రంగాలను బడ్జెట్ గుర్తించిందన్నారు. ఈ సందర్భంగా కేంద్రం, ఆర్థిక మంత్రి నిర్మలకు CM అభినందనలు చెప్పారు.
News February 1, 2025
కేంద్ర బడ్జెట్లో ఏపీకి కేటాయింపులు ఇలా..
ఏపీకి స్పెషల్ ప్యాకేజీ కింద 2024 DEC 24 వరకు రూ.3,685.31 కోట్లు విడుదల చేసినట్లు కేంద్రం పేర్కొంది. అలాగే బడ్జెట్లో పలు కేటాయింపులు చేసింది.
* పోలవరం ప్రాజెక్టుకు రూ.5,936cr
* ప్రాజెక్ట్ నిర్మాణానికి బ్యాలెన్స్ గ్రాంటు రూ.12,157cr
* విశాఖ స్టీల్ ప్లాంట్‌కు రూ.3,295cr
* విశాఖ పోర్టుకు రూ.730cr
* ఆరోగ్య వ్యవస్థల బలోపేతానికి: రూ.162cr
* జీరో బడ్జెట్ నేచురల్ ఫార్మింగ్‌కు: రూ.186cr