News February 2, 2025
‘పుష్ప-2’ 59వ రోజు వసూళ్లు ఎంతంటే?

‘పుష్ప-2’ సినిమా థియేటర్లలో విడుదలై 60 రోజులు పూర్తయ్యాయి. 59వ రోజు థియేటర్లలో ఈ మూవీకి దేశవ్యాప్తంగా రూ.10లక్షల కలెక్షన్స్ వచ్చినట్లు నేషనల్ మీడియా పేర్కొంది. ఇప్పటివరకూ నెట్ కలెక్షన్స్ రూ.1233.60 కోట్లు దాటిందని, హిందీ బెల్ట్‌లో రూ.820 కోట్లకు పైగా రాబట్టినట్లు తెలిపింది. ప్రపంచవ్యాప్తంగా రూ.1896కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లను సాధించిన ఈ సినిమా ఇప్పటికే NETFLIXలో స్ట్రీమింగ్‌కు వచ్చేసింది.
Similar News
News November 21, 2025
నడుము చుట్టుకొలత పెరిగితే డేంజరే

భారతీయుల శరీర నిర్మాణం ఇతరుల కంటే భిన్నంగా ఉంటుంది. ఇతర దేశాలవారిలో ఒకే BMI ఉన్నా, భారతీయుల్లో కొవ్వు శాతం కాస్త అధికంగా ఉంటుంది. ముఖ్యంగా భారతీయుల్లో నడుము చుట్టూ కొవ్వు పేరుకుపోతుంది. పురుషుల్లో 35.4 అంగుళాలు, స్త్రీలలో 31.5 అంగుళాలు నడుము చుట్టుకొలత దాటితే అంతర్గత కొవ్వు పెరిగి డయాబెటీస్ వస్తుందంటున్నారు. దీనికోసం సమయానికి, సరైన ఆహారం మితంగా తీసుకోవడం, వ్యాయామం, ధ్యానం చేయాలని సూచిస్తున్నారు.
News November 21, 2025
స్పీకర్‌ను కలిసిన కడియం శ్రీహరి.. రాజీనామా ప్రచారం?

TG: పార్టీ ఫిరాయింపుపై స్పీకర్ ప్రసాద్ ఇచ్చిన నోటీసుకు MLA కడియం శ్రీహరి స్పందించారు. గడువు(23)కు ముందే ఆయన్ను కలిసి వివరణకు మరింత సమయం కావాలని కోరారు. దీనిపై సభాపతి సానుకూలంగా స్పందించారు. మరోవైపు 2రోజుల్లో శ్రీహరి రాజీనామా చేస్తారని ప్రచారం జరుగుతోంది. జూబ్లీహిల్స్ ఉపఎన్నిక గెలుపు వేడిలోనే స్టేషన్ ఘన్‌పూర్‌లోనూ బైపోల్‌కు వెళ్లి BRSను ఇరుకున పెట్టాలని కాంగ్రెస్ స్కెచ్ వేసినట్లు చర్చ జరుగుతోంది.
News November 21, 2025
పెరుగుతున్న టమాటా ధరలు

దేశవ్యాప్తంగా టమాటా ధరలు క్రమంగా పెరుగుతున్నాయి. OCT 19 నుంచి NOV 19 మధ్య KG ధర సగటున ₹36 నుంచి ₹46కు పెరిగినట్లు కేంద్ర వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ పేర్కొంది. అధిక వర్షపాతంతో దిగుబడి తగ్గడంతోపాటు పెళ్లిళ్ల సీజన్ కారణంగా టమాటాకు డిమాండ్ పెరిగింది. దీంతో ఇప్పటికే కొన్నిచోట్ల KG రేటు ₹80కి చేరింది. కాగా APలోని అనంతపురం(D) కక్కలపల్లి మార్కెట్‌లో నిన్న గరిష్ఠంగా KG రేటు రూ.50 పలికింది.


