News April 12, 2025
ఆ 400 ఎకరాల తాకట్టులో దాగిన చీకటి కోణం ఏంటి?: హరీశ్ రావు

TG: గచ్చిబౌలిలోని 400 ఎకరాలను తనఖా పెట్టి రుణం తీసుకున్నట్లు అసెంబ్లీలో ప్రభుత్వం చెప్పిందని BRS MLA హరీశ్ రావు తెలిపారు. తాము తాకట్టు పెట్టుకోలేదని ICICI బ్యాంక్ చెబుతోందని, మరి GOVT ఎక్కడ తాకట్టు పెట్టిందని ప్రశ్నించారు. CM రేవంత్ తన బ్రోకర్ కంపెనీల వద్ద తనఖా పెట్టారా? అని నిలదీశారు. ఆ భూముల విషయంలో దాగి ఉన్న చీకటి కోణం ఏంటో చెప్పాలన్నారు. ఈ వ్యవహారంపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
Similar News
News December 13, 2025
చేపల చెరువుల్లో నీటి పీహెచ్ స్థాయి ఎంత ఉండాలి?

☛ చేపలు ఎక్కువగా పీహెచ్ స్థాయి 7.0-8.5 మధ్య ఉన్న చెరువు నీటిలో బాగా పెరుగుతాయి. ☛ చెరువులో నీటి పీహెచ్ స్థాయి 6.5 కన్నా తక్కువైతే (ఆమ్ల ధర్మం గల నీరు) చేపలు బలహీనమై, వ్యాధుల బారినపడతాయి. ☛ చెరువులో నీటి పీహెచ్ స్థాయి 9 కన్నా ఎక్కువైతే (క్షార ధర్మం గల నీరు) చేపల మొప్పలు దెబ్బతిని, ప్రాణ వాయువుని గ్రహించే శక్తి చేపల్లో తగ్గుతుంది. అందుకే నీటి పీహెచ్ స్థాయిని ఎప్పటికప్పుడు గమనిస్తుండాలి.
News December 13, 2025
గుమ్మడి దీపం పెడుతూ పఠించాల్సిన శ్లోకం..

కూష్మాండో బలిరూపేణ మమ భాగ్యాదవస్థితాః
ప్రణమామి తతస్సర్వ రూపిణం బలి రూపిణం
‘నేను బూడిద గుమ్మడికాయను బలిగా సమర్పిస్తున్నాను. ఫలితంగా నా జీవితంలో అదృష్టం, శుభం స్థిరంగా ఉంటాయి. ఈ బలి రూపాన్ని ధరించిన దైవ శక్తికి, అలాగే ఎన్నో రూపాల్లో ఉన్న ఆ శక్తికి నేను మనస్ఫూర్తిగా నమస్కరిస్తున్నాను’ అని చెప్పి కూష్మాండ దీపం వెలిగించాలి. తద్వారా ఆర్థిక, గ్రహ, కుటుంబ సమస్యల నుంచి రక్షణ లభిస్తుందని నమ్మకం.
News December 13, 2025
పొగమంచు, డ్రైవర్ అతివేగంతోనే ప్రమాదం: క్షతగాత్రులు

AP: అల్లూరి జిల్లాలో జరిగిన రోడ్డు <<18540788>>ప్రమాదానికి<<>> డ్రైవర్ మధు అతివేగమే కారణమని క్షతగాత్రులు వెల్లడించారు. పొగమంచుతో రోడ్డు సరిగ్గా కనిపించకపోయినా మలుపుల వద్ద వేగంగా తిప్పడంతో నియంత్రించలేకపోయాడని తెలిపారు. నిద్ర నుంచి తేరుకునేలోపే 9 మంది చనిపోయారన్నారు. అయితే ప్రమాదానికి ముందు బ్రేక్ పడట్లేదని మధు చెప్పాడని, ఇంతలోనే ప్రమాదం జరిగిందని మరో డ్రైవర్ ప్రసాద్ చెప్పారు.


