News October 7, 2024
కార్డియాక్ అరెస్ట్, హార్ట్ అటాక్‌కు తేడా ఏంటి?

ఈ రెండూ వేర్వేరని చాలామందికి తెలీదు. గుండెకు సరిపడా రక్త ప్రవాహం లేనప్పుడు హార్ట్ అటాక్ వస్తుంది. భుజం, చెస్ట్ పెయిన్, శ్వాసతగ్గడం, అలసట, యాంగ్జైటీ, వికారం హార్ట్ అటాక్ లక్షణాలు. హార్ట్‌బీట్ ఆగిపోయి, రక్తాన్ని మిగిలిన అవయవాలకు పంప్ చేయలేకపోతే స్పృహ కోల్పోయి కుప్పకూలుతారు. దీనినే కార్డియాక్ అరెస్ట్ అంటారు. కిందపడటం, పడే ముందు తల తిరగడం, స్పృహ కోల్పోవడం, శ్వాస, హార్ట్‌బీట్ ఆగడం దీని సింప్టమ్స్.
Similar News
News March 20, 2026
4 విడతల్లో 41 నోటిఫికేషన్లు!

AP: రాష్ట్ర ప్రభుత్వం నిన్న <<19422391>>జాబ్ క్యాలెండర్<<>> రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. ఈ ఏడాదిలోనే 10,060 పోస్టులు భర్తీ చేస్తామంది. ఇందుకోసం 4 విడతల్లో విభాగాల వారీగా 41 నోటిఫికేషన్లు ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. అత్యధికంగా DSC-2,535, కానిస్టేబుల్-1,970, అసోసియేట్, అసిస్టెంట్ ప్రొఫెసర్-1,500, గ్రూప్2-750, AEE-503, SI-418, ఎక్సైజ్ కానిస్టేబుల్-400, ప్లానింగ్ అసిస్టెంట్ స్టాటిస్టికల్ ఆఫీసర్-251 ఖాళీలు ఉన్నాయి.
News March 20, 2026
ఇండియన్లు సంతోషంగా లేరు!

UN రిలీజ్ చేసిన ‘ఇంటర్నేషనల్ హ్యాపీనెస్ రిపోర్ట్’ ప్రకారం ఇండియన్లు సంతోషంగా లేరని తేలింది. 147 దేశాలపై చేసిన స్టడీలో భారత్ 116వ స్థానంలో ఉంది. సామాజిక మద్దతు, ఆర్థిక అసమానతలు, పట్టణీకరణ, వ్యక్తిగత స్వేచ్ఛ, GDP, అవినీతి అంశాల ఆధారంగా ర్యాంకులు ఇచ్చింది. ఫిన్లాండ్ వరుసగా 9వ సారి టాప్-1గా నిలిచింది. అఫ్గాన్(147) చివర్లో ఉండగా, పాక్(104) మనకన్నా ముందుండటం ఆశ్చర్యకరం.
*నేడు అంతర్జాతీయ సంతోష దినోత్సవం
News March 20, 2026
రోడ్లపై ఉమ్మినందుకు ₹3.44 లక్షల ఫైన్!

లండన్‌లోని రోడ్లపై పాన్ ఉమ్మినందుకు ఇద్దరు భారతీయులకు అధికారులు ₹3.44 లక్షల జరిమానా విధించారు. గతేడాది జూన్‌లో కింగ్స్బరీ రోడ్డులో అక్షిత్ కుమార్, నార్త్ వెంబ్లే స్టేషన్ వద్ద హితేశ్ పటేల్ ఉమ్మేశారు. దీంతో వారికి 100 పౌండ్ల(₹12,533) చొప్పున అధికారులు స్పాట్ ఫైన్ వేశారు. కానీ వాళ్లు చెల్లించకపోవడంతో 1,391 పౌండ్ల(₹1.72 లక్షలు) చొప్పున ఫైన్ వేస్తూ బ్రెంట్ కౌన్సిల్ ఆదేశాలిచ్చింది.


