News January 2, 2025

గేమ్ ఛేంజర్ మూవీ డ్యూరేషన్ ఎంతంటే?

image

గేమ్ ఛేంజర్ మూవీకి సెన్సార్ బోర్డు U/A సర్టిఫికెట్ జారీ చేసింది. మొత్తం మూవీ నిడివి 2:45:30 సెకన్లుగా ఉంది. ఈ క్రమంలో సినిమాలో పలు మార్పులను సూచించింది. లిక్కర్ లేబుల్స్‌ను CGతో కవర్ చేయడం, కొన్ని డైలాగులకు ప్రత్యామ్నాయ పదాలు, ఓ పేరు మార్పుతో పాటు టైటిల్స్‌లో పద్మశ్రీ పదాన్ని తొలగించాలని సూచించింది. రామ్ చరణ్, శంకర్ కాంబినేషన్లో తెరకెక్కిన ఈ చిత్రం ఈ నెల 10న థియేటర్లలో విడుదల కానుంది.

Similar News

News December 2, 2025

ADB: అసలు మీరు ఏ వర్గం రా బాబూ..!

image

పంచాయతీ ఎన్నికల వేళ పార్టీలోకి ఫిరాయింపులు, చేరికలు జోరందుకున్నాయి. పలువురు నాయకులు ఓవైపు అధికార పార్టీ నాయకులతో సంప్రదింపులు జరుపుతూ, మరోవైపు ప్రతిపక్ష ఎమ్మెల్యేలు నాయకులతో అంట కాగుతున్నారు. ఉదయం ఒక పార్టీ కండువా వేసుకుని.. సాయంత్రం మరో పార్టీలో చేరుతున్న ఘటనలు చేసుకుంటున్నాయి. ఇది చూసిన పలువురు మీరు ఏ వర్గం రా బాబు అంటూ ఆశ్చర్యానికి లోనవుతున్నారు. మీ ప్రాంతంలోనూ ఇలాగే జరుగుతోందా కామెంట్ చేయండి.

News December 2, 2025

స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు

image

హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. 24 క్యారెట్ల 10గ్రాముల గోల్డ్ రేటు రూ.280 తగ్గి రూ.1,30,200కు చేరింది. అలాగే 22 క్యారెట్ల 10గ్రాముల పసిడి ధర రూ.250 పతనమై రూ.1,19,350 పలుకుతోంది. అటు వెండి ధరల్లో ఎలాంటి మార్పులేదు. కేజీ సిల్వర్ రేటు రూ.1,96,000గా ఉంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ఇవే ధరలున్నాయి.

News December 2, 2025

గొర్రెలకు సంపూర్ణ ఆహారం ఎలా అందుతుంది?

image

గొర్రెలకు మాంసకృత్తులు, క్రొవ్వు పదార్థాలు, ఖనిజ లవణాలు, పిండి పదార్థాలు, విటమిన్లతో కూడిన సంపూర్ణ దాణా(ఆహారం) అందేలా జాగ్రత్త వహించాలి. అప్పుడే గొర్రె మందలు ఆరోగ్యంగా పెరుగుతాయి. మంచి దాణా వల్ల గొర్రెల్లో పునరుత్పత్తి సామర్థ్యం పెరిగి వాటి మందలు వృద్ధిచెంది, పెంపకందారులకు అధిక ఆదాయం అందిస్తాయి. సరైన పోషకాహారం అందని తల్లి గొర్రెల వద్ద పిల్లలకు సరిపోను పాలుండకపోతే పిల్లలు సరిగా ఎదగక మరణిస్తాయి.