News November 15, 2024

‘కంగువా’ తొలిరోజు కలెక్షన్లు ఎంతంటే?

image

సూర్య నటించిన ‘కంగువా’ వరల్డ్ వైడ్‌గా తొలిరోజు రూ.58.62 కోట్లు(గ్రాస్) రాబట్టినట్లు మేకర్స్ ప్రకటించారు. రేపు, ఎల్లుండి వీకెండ్స్ కావడంతో కలెక్షన్లు మరింత పెరిగే ఛాన్స్ ఉంది. ఇక నిన్న విడుదలైన ఈ మూవీ సినీ అభిమానుల నుంచి మిక్స్‌డ్ టాక్ సొంతం చేసుకుంది. శివ దర్శకత్వం వహించిన కంగువాలో బాలీవుడ్ బ్యూటీ దిశా పటానీ కీలకపాత్ర పోషించారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు.

Similar News

News February 20, 2026

వాట్సాప్‌లో ఇంట్రెస్టింగ్ ఫీచర్!

image

వాట్సాప్ గ్రూప్ చాట్‌లలో సరికొత్త ఫీచర్ అందుబాటులోకి వచ్చింది. ఇకపై గ్రూప్‌లో కొత్తగా చేరిన వారు అంతకుముందు జరిగిన సంభాషణ గురించి తెలుసుకోవచ్చు. అడ్మిన్లు లేదా సభ్యులు గత 25 నుంచి 100 మెసేజ్‌లను వారికి షేర్ చేయవచ్చు. ఇది పూర్తి సురక్షితమైన ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్షన్‌తో పనిచేస్తుంది. హిస్టరీ షేర్ చేసినప్పుడు గ్రూప్‌లోని అందరికీ ఇది తెలుస్తుంది. అడ్మిన్లు ఈ ఫీచర్‌ను ఎప్పుడైనా నిలిపివేయవచ్చు.

News February 20, 2026

ఇది వరి లాంటి కలుపు మొక్క

image

వరి చేనులో ‘బొంత ఊద’ కలుపు మొక్కలు కలవరపెడుతున్నాయి. ఇవి కూడా వరి మాదిరిగానే పెరుగుతాయి. పూర్తిగా పెరిగే వరకు వీటిని గుర్తుపట్టలేము. అందుకే దీన్ని దొంగ వరి అంటారు. పంటకు అందించే పోషకాలను ఇవి గ్రహించి వరి కంటే ఎక్కువ ఎత్తు పెరుగుతాయి. ఈ కలుపు మొక్కల వల్ల వరిలో పొడ తెగులు, సుడిదోమ ఉద్ధృతి పెరుగుతుందని రైతులు అంటున్నారు. వరిలో ఇలాంటి కలుపును గుర్తిస్తే నిపుణుల సూచనల మేరకు మందులు వాడి నిర్మూలించండి.

News February 20, 2026

బెంగళూరు- BZA మధ్య వందేభారత్ వేయండి.. స్పందించిన లోకేశ్

image

బెంగళూరులో ఉంటున్న కోస్తాంధ్ర టెకీల రైలు కష్టాలపై ఏపీ మంత్రి లోకేశ్ సానుకూలంగా స్పందించారు. బెంగళూరు నుంచి విజయవాడకు వందేభారత్ రైలు కావాలని ఓ నెటిజన్ ట్వీట్ చేశారు. ఈ అంశాన్ని రైల్వే శాఖ దృష్టికి తీసుకెళ్తామని లోకేశ్ భరోసానిచ్చారు. వెంటనే చర్యలు తీసుకోవాలని MP కేశినేని చిన్నిని కోరారు. ‘వందేభారత్ స్లీపర్’ రైలు తీసుకొచ్చేలా కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్‌తో చర్చలు జరుపుతున్నట్లు MP తెలిపారు.