News December 6, 2024
పుష్ప-2 తొలిరోజు కలెక్షన్స్ ఎంతంటే?

పుష్ప-2 సినిమాకు తొలిరోజు రూ.294 కోట్ల కలెక్షన్స్ వచ్చాయని మైత్రీ మూవీ మేకర్స్ ప్రకటించింది. భారత సినీ చరిత్రలో ఇదే అత్యధికమని పేర్కొంది. ALL TIME RECORD అంటూ ఓ పోస్టర్‌ను రిలీజ్ చేసింది. హిందీలో ఈ సినిమాకు ఫస్ట్ డే రూ.72కోట్ల వసూళ్లు వచ్చినట్లు ఇప్పటికే ప్రకటించింది.
Similar News
News November 28, 2025
నాగార్జున సాగర్: శిల్పాలతో బుద్ధుని జీవితం బోధపడేలా..!

నాగార్జునసాగర్‌లో నిర్మిస్తోన్న బుద్ధచరిత వనం ప్రత్యేక ఆకర్షణగా మారుతోంది. ఇక్కడి శిల్పాలు బుద్ధుడి సంపూర్ణ జీవన ప్రయాణాన్ని జీవంగాను చూపిస్తున్నాయి. జననం, గౌతముని రాజకుమార జీవితం, బోధి వృక్షం కింద జ్ఞానోదయం, ధర్మచక్ర ప్రవర్తనం, మహాపరినిర్వాణం వంటి ముఖ్య ఘట్టాలు ప్రతీ శిల్పంలో ప్రతిబింబిస్తున్నాయి. సందర్శకులకు ప్రతి శిల్ప సమూహం ఆధ్యాత్మికత, శాంతి, బోధనలను స్పష్టంగా తెలియజేసేలా రూపొందించారు.
News November 28, 2025
22 ఏళ్లకే సర్పంచ్.. ఊరిని మార్చేందుకు యువతి ముందడుగు!

డిగ్రీ, పీజీ పూర్తయ్యాక పట్టణాలకు వలసెళ్లకుండా ఊరిని బాగుచేయాలి అనుకునే యువతకు 22 ఏళ్ల సాక్షి రావత్ స్ఫూర్తిగా నిలుస్తున్నారు. సర్పంచ్‌గా మారి గ్రామాన్ని అన్ని విధాలుగా తీర్చిదిద్దాలని భావించిన సాక్షికి ఊరి ప్రజల తోడు లభించింది. ఉత్తరాఖండ్‌లోని కుయ్ గ్రామ ఎన్నికల్లో ఆమె సర్పంచ్‌గా గెలిచారు. విద్య, ఆరోగ్యం, గ్రామీణ ఉపాధిపై దృష్టి సారించి.. యువ శక్తితో గ్రామాభివృద్ధికి కృషి చేస్తానని ఆమె తెలిపారు.
News November 28, 2025
పిన్నెల్లి సోదరులకు సుప్రీంలో ఎదురుదెబ్బ

AP: YCP నేత పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన సోదరుడు వెంకట్రామిరెడ్డికి సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. వారి ముందస్తు బెయిల్ పిటిషన్‌ను ధర్మాసనం కొట్టేసింది. సరెండర్ కావడానికి 2 వారాల గడువు ఇచ్చింది. పల్నాడు జిల్లా వెల్దుర్తి మండలం గుండ్లపాడు జంట హత్య కేసులో వీరిద్దరూ నిందితులుగా ఉన్నారు. ముందస్తు బెయిల్ కోసం వారు గతంలో హైకోర్టును ఆశ్రయించగా చుక్కెదురైంది. దీంతో SCని ఆశ్రయించారు.


