News August 30, 2024

‘సరిపోదా శనివారం’ తొలిరోజు కలెక్షన్లు ఎంతంటే?

image

నేచురల్ స్టార్ నాని హీరోగా వివేక్ ఆత్రేయ తెరకెక్కించిన ‘సరిపోదా శనివారం’ నిన్న థియేటర్లలో రిలీజై పాజిటివ్ టాక్‌తో దూసుకుపోతోంది. మొదటి రోజు తెలుగు రాష్ట్రాల్లో రూ.8.85 కోట్ల(గ్రాస్) కలెక్షన్లు రాబట్టగా ప్రపంచవ్యాప్తంగా రూ.20.40 కోట్లు కొల్లగొట్టింది. నిన్న మధ్యాహ్నం నుంచి థియేటర్లలో ఆక్యుపెన్సీ పెరిగిందని వీకెండ్ పూర్తయ్యేలోపు బ్రేక్ ఈవెన్ రావొచ్చని సినీవర్గాలు అంచనా వేస్తున్నాయి.

Similar News

News December 7, 2025

6వేల మందితో మూడంచెల భద్రత: సీపీ సుధీర్ బాబు

image

TG: గ్లోబల్ సమ్మిట్‌కు భద్రతా పరంగా అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు రాచకొండ సీపీ సుధీర్ బాబు వెల్లడించారు. ‘6 వేల మంది పోలీసులతో మూడంచెల భద్రత, వెయ్యి సీసీ కెమెరాలు ఏర్పాటు చేశాం. 2 రోజుల తర్వాత పబ్లిక్‌కు అనుమతి ఉంటుంది. డెలిగేట్స్‌కు పైలట్ వాహనాలను ఏర్పాటు చేశాం. సమ్మిట్ జరిగే రోజుల్లో ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయి. శ్రీశైలం నుంచి వచ్చే వాహనాలు ప్రత్యామ్నాయ మార్గాలు చూసుకోవాలి’ అని పేర్కొన్నారు.

News December 7, 2025

తల్లయిన హీరోయిన్ సోనారిక

image

టాలీవుడ్ హీరోయిన్ సోనారిక తల్లి అయ్యారు. ఈ నెల 5న పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చినట్లు ఇవాళ ఆమె ఇన్‌స్టాలో వెల్లడించారు. ‘దేవోం కే దేవ్ మహాదేవ్’ సీరియల్‌లో పార్వతీదేవిగా నటించిన ఆమె దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నారు. తెలుగులో జాదూగాడు, స్పీడున్నోడు, ఈడోరకం ఆడోరకం సినిమాల్లో హీరోయిన్‌గా నటించారు. గత ఏడాది వ్యాపారవేత్త వికాస్ పరాశర్‌ను వివాహం చేసుకున్నారు.

News December 7, 2025

తెలంగాణ దిశా దశను మార్చనున్న గ్లోబల్ సమ్మిట్: పొంగులేటి

image

TG: రేపటి నుంచి జరిగే గ్లోబల్ సమ్మిట్ తెలంగాణ దిశా దశను మార్చనుందని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. ప్రపంచ ఉన్నత నగరాల స్థాయికి ఫ్యూచర్ సిటీ చేరుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. గ్లోబల్ సమ్మిట్ ఏర్పాట్లను ఆయన పరిశీలించారు. 2047 లక్ష్యంగా సాగుతున్న ప్రణాళికలకు ఊతమిచ్చే విధంగా పెట్టుబడులు రానున్నాయని తెలిపారు. సుమారు 150 మంది అత్యంత ప్రముఖులు ఈ సమ్మిట్‌లో పాల్గొనబోతున్నారని చెప్పారు.