News March 25, 2024
ధరణిలో లోపాలుంటే ప్రభుత్వం ఏం చేస్తోంది: పల్లా

TG: ధరణిలో లోపాలున్నాయని, వాటిని తాము గుర్తించామని చెప్పిన ప్రభుత్వం ఇప్పుడు ఎందుకు స్పందించడం లేదని BRS ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి ప్రశ్నించారు. ‘4 నెలల క్రితం ధరణిలో లోపాలున్నాయని చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం వాటిని ఎందుకు సరిదిద్దడం లేదు. చట్ట ప్రకారం రైతుల భూములు పట్టాలు చేయాలి. అద్భుతంగా నడిచిన ధరణిని కొనసాగించాలి. రైతుల ఉసురు పోసుకోవద్దు’ అని అన్నారు.
Similar News
News March 12, 2026
భారత నౌకాదళంలో అగ్నివీర్ ఉద్యోగాలు

భారత నౌకాదళం అగ్నివీర్ (SSR) అవివాహిత పురుష, మహిళల నుంచి దరఖాస్తులు కోరుతోంది. 50% మార్కులతో 10+2(మ్యాథ్స్, ఫిజిక్స్) లేదా డిప్లొమా/వొకేషనల్ కోర్సు పూర్తిచేసిన వారు అర్హులు. DEC 2004 – OCT 2009 మధ్య జన్మించి ఉండాలి. కంప్యూటర్ ఆధారిత పరీక్ష, PFT, మెడికల్ టెస్ట్ ద్వారా ఎంపిక చేస్తారు. MAR 14 – APR 06 మధ్య అప్లై చేయాలి. ఫీజు: రూ.550 + GST. వెబ్‌సైట్: joinindiannavy.gov.in
News March 12, 2026
TTDలో 30 పోస్టులు.. మార్చి 16 వరకు గడువు

తిరుమల తిరుపతి దేవస్థానం(TTD)30 పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. పోస్టును బట్టి MBBS, MS/DNB, MD, PG డిప్లొమా అర్హతతో పాటు పని అనుభవం గలవారు మార్చి16 వరకు అప్లై చేసుకోవచ్చు. ప్రొఫెసర్‌కు నెలకు రూ.2.92L, అసోసియేట్ ప్రొఫెసర్‌కు రూ.2.73L, అసిస్టెంట్ ప్రొఫెసర్‌కు రూ.2.09L, మెడికల్ ఆఫీసర్‌కు రూ.93,525, Jr. రెసిడెంట్‌కు రూ.74,750, Sr. రెసిడెంట్‌కు రూ.80,500 చెల్లిస్తారు. సైట్: www.tirumala.org
News March 12, 2026
BREAKING: తగ్గిన బంగారం, వెండి ధరలు

హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో ఇవాళ బంగారం, వెండి ధరలు తగ్గాయి. 24 క్యారెట్ల 10గ్రాముల గోల్డ్ రేటు రూ.1,090 తగ్గి రూ.1,62,220కు చేరింది. అలాగే 22 క్యారెట్ల 10గ్రాముల గోల్డ్ రేటు రూ.1,000 పడిపోయి రూ.1,48,700 పలుకుతోంది. అటు కేజీ వెండిపై రూ.10వేలు తగ్గి రూ.2,90,000గా ఉంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ఇవే ధరలుండొచ్చు.


