News October 26, 2025

భగవంతుని నామస్మరణ గొప్పతనం ఏంటంటే..?

image

భగవంతుడి నామస్మరణ ఎంతో మహత్తరమైనది. ఆ నామాన్ని భక్తితో, వైరాగ్యంతో మాత్రమే కాక, కోపంతో, అలవాటుగా, అనాలోచితంగా పలికినా కూడా సకల శుభాలనూ, మోక్ష ఫలాలనూ అందిస్తుంది. భావనతో సంబంధం లేకుండా ఆ నామ సంకీర్తన నిరంతర శుద్ధిని కలిగిస్తుంది. అంతిమంగా జీవునికి మేలు చేకూర్చుతుంది. అందుకే ఆయన పేరుతో ఆయణ్ను దూషించినా.. అది దైవ నామ స్మరణే అవుతుందని పండితులు చెబుతుంటారు. భగవత్ నామానికి ఉన్న అద్భుత శక్తి ఇది.<<-se>>#Bakthi<<>>

Similar News

News October 26, 2025

పశువుల పాలు పితికిన తర్వాత జాగ్రత్తలు

image

పాలు పితికిన తర్వాత పశువును అరగంట వరకు నేలపై పడుకోనీయకూడదు. పాలు పితకడం వల్ల పశువుల చనురంధ్రాలు తెరచుకొని ఉంటాయి. అప్పుడు ఆవు/గేదె పడుకుంటే ఆ రంధ్రాల నుంచి బ్యాక్టీరియా త్వరగా పొదుగులో చేరి పొదుగువాపు వ్యాధి వచ్చే అవకాశం ఉంది. ఒక పశువు పాలు తీసిన తర్వాత చేతులను శుభ్రంగా కడుక్కున్న తర్వాతే మరో పశువు పాలు తీయాలి. దీని వల్ల ఒక పశువుకు ఉన్న అంటువ్యాధులు ఇతర పశువులకు వ్యాపించే ముప్పు తగ్గుతుంది.

News October 26, 2025

నిమిషాల్లోనే అదృష్టం మారి’పోయింది’!

image

మధ్యప్రదేశ్‌‌కు చెందిన వినోద్ డోంగ్లీ అనే నోటరీ లాయర్ కొన్ని నిమిషాలపాటు బిలియనీర్‌గా మారారు. తన డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేయగానే రూ.2,817 కోట్ల విలువైన 1,312 హర్సిల్ ఆగ్రో లిమిటెడ్ కంపెనీ షేర్లు కనిపించడంతో షాకయ్యాడు. ఇది నిజమే అని సంభ్రమాశ్చర్యంలో మునిగిపోగానే ఆ షేర్లన్నీ తన ఖాతాలోంచి మాయమైపోవడంతో కంగుతిన్నారు. టెక్నికల్ గ్లిచ్ వల్ల ఇలా జరగడంతో తన అదృష్టం కాసేపే అని నవ్వుకున్నారు.

News October 26, 2025

ఎలాంటి ఫేస్‌కి ఏ బొట్టు బావుంటుందంటే..

image

ముఖాన్ని అందంగా మార్చడంలో బొట్టు కీలకపాత్ర పోషిస్తుంది. అయితే ప్రస్తుతం మార్కెట్లో ఎన్నోరకాల స్టిక్కర్లున్నాయి. ముఖాకృతిని బట్టి వాటిని ఎంచుకోవాలి. రౌండ్ ఫేస్ ఉంటే పొడుగ్గా ఉండే స్టిక్కర్ ఎంచుకోవాలి. స్క్వేర్ షేప్‌కు రౌండ్ స్టిక్కర్లు, డైమండ్ షేప్‌కు సింపుల్ బిందీ, హార్ట్ షేప్‌కు పొడుగు స్టిక్కర్లు, ఓవల్ షేప్‌కు రౌండ్ బిందీ బావుంటాయి. కొత్త స్టిక్కర్లు ట్రై చేస్తేనే ఏది సెట్ అవుతుందో తెలుస్తుంది.