News March 8, 2025
నటుడి భార్యను చంపిన హంటావైరస్.. ఏంటిది?

హాలీవుడ్ యాక్టర్ జీన్ హ్యాక్‌మన్ భార్య బెట్సీ అర్కావా <<15598233>>మరణానికి<<>> కారణమైన హంటావైరస్‌పై చర్చ జరుగుతోంది. ఇది ఇన్ఫెక్టైన ఎలుకలు స్రవించిన ద్రవాలతో సోకుతుంది. వాటి నుంచి మనిషికి వస్తుందే కానీ అంటువ్యాధి కాదు. అలసట, జ్వరం, కండరాల నొప్పి, దగ్గు, శ్వాస తగ్గడం, లంగ్స్‌లో నీరుచేరడం దీని లక్షణాలు. ప్రతి ముగ్గురు రోగుల్లో ఒకరు బతకడం కష్టం. అందుకే నివాస ప్రాంతాలను శుభ్రంగా ఉంచుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.
Similar News
News January 20, 2026
రోహిత్, కోహ్లీకి బీసీసీఐ షాక్ ఇవ్వనుందా?

భారత క్రికెటర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ విషయంలో BCCI కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. వార్షిక కాంట్రాక్టుల్లో టైర్-2కు డిమోట్ చేయనుందని సమాచారం. 4 టైర్ రిటైనర్‌షిప్ సిస్టమ్ నుంచి A+ క్యాటగిరీని తొలగించాలని అగార్కర్ ఆధ్వర్యంలోని సెలక్షన్ కమిటీ బోర్డుకు సూచించినట్లు తెలిసిందని India Today పేర్కొంది. A+ ఆటగాళ్లకు ₹7 కోట్లు, A-₹5 కోట్లు, B-₹3 కోట్లు, C- ₹1 కోటిని BCCI చెల్లిస్తోంది.
News January 20, 2026
ఇది సిట్ విచారణ కాదు.. చిట్టి విచారణ: కేటీఆర్

TG: ఫోన్ ట్యాపింగ్ కేసులో చేస్తుంది సిట్ విచారణ కాదని చిట్టి విచారణ అని కేటీఆర్ విమర్శలు చేశారు. ఇదో లొట్ట పీసు కేసు అంటూ వ్యాఖ్యలు చేశారు. తమ పార్టీ నేతలను విచారణ, కమిషన్ల పేరుతో ప్రభుత్వం వేధింపులకు పాల్పడుతోందని దుయ్యబట్టారు. తన బురదను అందరికీ అంటించే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. దీంతో డైవర్షన్ పాలిటిక్స్ మొదలుపెడుతున్నారన్నారు. నైనీ బ్లాక్ రద్దు వెనక వాటాల పంచాయితీ ఉందని ఫైరయ్యారు.
News January 20, 2026
ALL TIME RECORD: ఒక్క రోజులో RTCకి రూ.27.68 కోట్ల ఆదాయం

AP: సంక్రాంతి పండగ వేళ APSRTC రికార్డు సృష్టించింది. సంస్థ చరిత్రలో ఒక్కరోజులో అత్యధిక ఆదాయాన్ని ఆర్జించింది. జనవరి 19న రూ.27.68 కోట్ల రాబడిని సాధించింది. ఆ రోజు మొత్తం 50.60 లక్షల మందిని గమ్యాలకు చేర్చింది. సంక్రాంతికి సొంతూళ్లకు వెళ్లిన వారికి తిరుగు ప్రయాణంలో ఇబ్బందులు లేకుండా గమ్యస్థానాలకు చేర్చింది. డ్రైవర్లు, కండక్టర్లు ఇతర సిబ్బందికి ఎండీ ద్వారకా తిరుమలరావు అభినందనలు తెలిపారు.


