News December 22, 2024
ఈ ఏడాది అత్యంత లాభాలు చూసిన సినిమా ఏదంటే..
ఈ ఏడాది అత్యధిక శాతం లాభాలు పొందిన తెలుగు సినిమా ఏది? పుష్ప-2 సినిమా ఇప్పటికే రూ.1500 కోట్ల మార్కును దాటేసినా తొలి స్థానంలో ఉన్నది ఆ మూవీ కాదు. ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం.. రూ.40 కోట్ల బడ్జెట్తో తెరకెక్కి వరల్డ్ వైడ్ రూ.350 కోట్ల వరకూ వసూలు చేసిన హనుమాన్ మూవీ అగ్రస్థానంలో ఉంది. ఆ సినిమాకు 650 శాతం నుంచి 775 శాతం మేర లాభాలు వచ్చినట్లు అంచనా.
Similar News
News December 22, 2024
అల్లు అర్జున్ ప్రెస్మీట్పై మంత్రి కామెంట్స్
TG: ప్రెస్మీట్లో అల్లు అర్జున్ కామెంట్స్ సీఎంను అగౌరవపరిచే విధంగా ఉన్నాయని, వాటిని వెనక్కి తీసుకోవాలని సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి డిమాండ్ చేశారు. పర్మిషన్ లేకుండా ఆయన థియేటర్కు వచ్చారని, తమ వద్ద అన్ని ఆధారాలున్నాయని చెప్పారు. ఈ ఘటనను రాజకీయం చేయొద్దని, చట్టం తన పని తాను చేసుకుపోతుందని వ్యాఖ్యానించారు. ప్రభుత్వం, సినీ ఇండస్ట్రీ మధ్య గ్యాప్ లేదని మంత్రి స్పష్టం చేశారు.
News December 22, 2024
పేర్ని నానికి పోలీసుల నోటీసులు
AP: మాజీ మంత్రి పేర్ని నాని, ఆయన కుమారుడు పేర్ని కిట్టుకి పోలీసులు నోటీసులు జారీ చేశారు. రేషన్ బియ్యం పక్కదారి పట్టిన కేసులో విచారణకు ఈరోజు మధ్యాహ్నం 2 గంటల్లోగా హాజరు కావాలని సూచించారు. ఇంట్లో ఎవరూ లేకపోవడంతో ఆయన ఇంటి తలుపులకు నోటీసులు అంటించినట్లు సమాచారం.
News December 22, 2024
ఘోర ప్రమాదం.. 38 మంది మృతి
ఆఫ్రికా దేశం కాంగోలోని బుసిరా నదిలో పడవ బోల్తా పడింది. ఈ ఘటనలో 38 మంది మరణించారు. 100 మందికి పైగా గల్లంతయ్యారు. సుమారు 400 మంది ఫెర్రీలో క్రిస్మస్ వేడుకల కోసం స్వస్థలాలకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. గల్లంతైన వారి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.