News February 26, 2025

ఆ ఇద్దరి కళ్లల్లో ఆనందం ఏమిటో?: BRS

image

TG: CM రేవంత్ నడుపుతున్నది కాంగ్రెస్-BJP సంకీర్ణ సర్కార్ అని BRS ఆరోపించింది. ‘MLC ఎన్నికల ఓటింగ్‌కు ముందు రోజు BJP ప్రధానిని, కాంగ్రెస్ CM కలవడంలో మర్మం ఏంటి? మేము గెలిచినా ఓడినా మాకు ఏమి ఫరక్ పడదు అని CM అనడంలో మతలబు ఏంటి? ఆ ఇద్దరి కళ్లల్లో ఆనందం ఏమిటో? మోదీ అపాయింట్మెంట్ సులువుగా దొరకడం ఏమిటో రాహుల్ అపాయింట్మెంట్ దొరకకపోవడం ఏమిటో?’ అంటూ పీఎం, సీఎం భేటీకి సంబంధించిన ఫొటోను ట్వీట్ చేసింది.

Similar News

News February 26, 2025

ఆదాయం పెంచేందుకు ప్రయత్నిస్తున్నాం: CM

image

తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీలో మీడియాతో చిట్‌చాట్‌లో కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రతి నెల 1వ తేదీకి రూ.22,500 కోట్లు అవసరమని, ఆదాయం రూ.18,500 కోట్లు మాత్రమే వస్తుందని చెప్పారు. జీతాలకు రూ.6500 కోట్లు, వడ్డీలకు రూ.6800 కోట్లు అవసరమని, ఆదాయం రూ.22 వేల కోట్లకు పెంచేందుకు ప్రయత్నిస్తున్నట్లు వెల్లడించారు. అటు SLBCలో చిక్కుకున్న వారిని కాపాడేందుకు తాము కృషి చేస్తున్నట్లు తెలిపారు.

News February 26, 2025

సన్‌రైజర్స్ హైదరాబాద్‌ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్

image

ఐపీఎల్ 2025 సీజన్‌కు తాను సిద్ధమని సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ పాట్ కమిన్స్ తెలిపారు. చీలమండ గాయం నుంచి తాను పూర్తిగా కోలుకున్నట్లు ఆయన ప్రకటించారు. ఐపీఎల్, WTC ఫైనల్ కోసం ఇప్పటికే ప్రాక్టీస్ ప్రారంభించినట్లు చెప్పారు. కాగా, చీలమండ గాయం కారణంగా కమిన్స్ కొద్ది రోజులుగా క్రికెట్‌కు దూరమయ్యారు. శ్రీలంకతో టెస్ట్ సిరీస్, పాకిస్థాన్‌లో జరుగుతున్న ఛాంపియన్స్ ట్రోఫీ నుంచి కూడా ఆయన తప్పుకున్నారు.

News February 26, 2025

నా నిజమైన ఫస్ట్ లవ్ అదే: సమంత

image

అనారోగ్యంతో కొద్దికాలంగా స్క్రీన్‌పై తక్కువగా కనిపిస్తున్న సమంత త్వరలో బిజీగా మారనున్నట్లు చెప్పారు. ఒకట్రెండు నెలల్లో చాలా వర్క్ మొదలు కానుందని, షూటింగ్‌లతో బిజీబిజీగా గడపనున్నట్లు తెలిపారు. సినిమాలే తన నిజమైన ఫస్ట్ లవ్ అని, ఇక వాటికి దూరంగా ఉండనన్నారు. సమంత ‘రక్త బ్రహ్మాండ్’ సిరీస్‌తో పాటు ఓ మూవీలో నటించేందుకు సిద్ధమవుతున్నారు. అలాగే, తొలిసారి నిర్మాతగా మారి ‘బంగారం’ అనే మూవీ నిర్మించనున్నారు.

error: Content is protected !!