News November 14, 2024
‘పుష్ప 2’ ట్రైలర్ నిడివి ఎంతంటే?

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న ‘పుష్ప 2’ మూవీ ట్రైలర్ ఈ నెల 17న విడుదల కానుంది. పట్నాలో సాయంత్రం 5 గంటలకు లాంచ్ ఈవెంట్ ప్రారంభం కానుంది. ట్రైలర్ నిడివి 2 నిమిషాల 44 సెకన్లు ఉండనుంది. కాగా దేశవ్యాప్తంగా ఉన్న ముఖ్యమైన నగరాల్లో మూవీ టీమ్ ప్రమోషన్లు చేయనుంది. సుకుమార్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో రష్మిక మందన్న హీరోయిన్గా నటిస్తున్నారు. డిసెంబర్ 5న వరల్డ్ వైడ్గా మూవీ రిలీజ్ కానుంది.
Similar News
News November 23, 2025
సర్పంచి ఎన్నికలు.. UPDATE

TG: గ్రామపంచాయతీ ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం సిద్ధమైంది. ఈ మేరకు వార్డుల వారీగా రిజర్వేషన్లు ఖరారు చేసింది. ఈ రిజర్వేషన్ల జాబితాను జిల్లాల కలెక్టర్లకు పంపిస్తోంది. సాయంత్రం కల్లా ఈ ప్రక్రియ పూర్తికానున్నట్లు తెలుస్తోంది. జనాభా నిష్పత్తిని బట్టి SC, ఎస్టీ, బీసీ స్థానాలను కేటాయించినట్లు సమాచారం. కాగా బీసీలకు 22%తో కలుపుకొని మొత్తం రిజర్వేషన్లు 50% మించకుండా అధికారులు జాగ్రత్తలు తీసుకున్నారు.
News November 23, 2025
ఈ రిలేషన్షిప్ ట్రెండ్స్ గురించి తెలుసా?

జెన్ జి కిడ్స్ ప్రతి వ్యక్తితోనూ వారికున్న రిలేషన్కి విచిత్రమైన పేర్లు పెట్టేసి ట్రెండ్ చేస్తున్నారు. వాటిల్లో కొన్నిటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
* ఎవాల్యూషన్షిప్-ఈ రిలేషన్లో ఉన్నవారు మొదట్లో మామూలుగానే ఉంటారు. పోనుపోనూ వారి అనుబంధం బలపడుతుంది. ఒకరినొకరు ప్రోత్సహించుకుంటూ ముందుకెళ్తారు.* బెంచింగ్షిప్- ఈ రిలేషన్షిప్లో ఒకరితో ఒకరు పూర్తిగా సంబంధాన్ని పెంచుకోరు, అలాగని తెంచుకోరు.
News November 23, 2025
రేపు CJIగా ప్రమాణం చేయనున్న జస్టిస్ సూర్యకాంత్

సుప్రీంకోర్టు తదుపరి ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సూర్యకాంత్ రేపు ప్రమాణస్వీకారం చేయనున్నారు. 2027 FEB 9 వరకు పదవిలో కొనసాగనున్నారు. CJIగా బాధ్యతలు చేపట్టనున్న తొలి హరియాణా వాసిగా సూర్యకాంత్ రికార్డు సృష్టించనున్నారు. ఈయన అవినీతి, బిహార్ ఓటర్ల జాబితా, పర్యావరణం, వాక్స్వాతంత్య్రం, లింగసమానత్వం వంటి అంశాల్లో కీలక తీర్పులను వెలువరించారు. ఆర్టికల్ 370 రద్దుపై తీర్పు ఇచ్చిన ధర్మాసనంలోనూ ఉన్నారు.


