News May 23, 2024
ఒడిశాలోని రత్న భండార్‌కు తమిళనాడుతో లింకేంటి?

ఒడిశాలోని పూరీ జగన్నాథ్ ఆలయ రత్న భండార్ తాళం తమిళనాడుకు వెళ్లిందని మోదీ అనడం, దాన్ని CM స్టాలిన్ తీవ్రంగా ఖండించడం హాట్ టాపిక్‌గా మారింది. తమిళనాడుకు చెందిన మాజీ ఐఏఎస్ కార్తీక్ పాండియన్ ఒడిశాలో పని చేసినప్పుడు CM నవీన్ పట్నాయక్‌కి సన్నిహితుడిగా ఎదిగారు. దీంతో తాను పదవిలో ఉన్నప్పుడు రత్న భండార్ తాళం తన స్వరాష్ట్రమైన తమిళనాడుకు పంపించారని.. ఆయనను ఉద్దేశిస్తూ మోదీ ఆరోపణలు చేశారు.
Similar News
News December 9, 2025
డిసెంబర్ 9: చరిత్రలో ఈ రోజు

1946: ఏఐసీసీ అగ్ర నేత సోనియా గాంధీ జననం
1970: టాలీవుడ్ డైరెక్టర్ వి.సముద్ర జననం
1975: హీరోయిన్ ప్రియా గిల్ జననం
1981: హీరోయిన్ కీర్తి చావ్లా జననం
2009: తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ ప్రారంభిస్తున్నట్లు అప్పటి కేంద్ర హోం మంత్రి చిదంబరం ప్రకటన
– అంతర్జాతీయ అవినీతి వ్యతిరేక దినోత్సవం
News December 9, 2025
పుట్టినరోజు శుభాకాంక్షలు

ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.
News December 9, 2025
ఎయిర్‌లైన్స్ లోపాలను వెంటనే సరిదిద్దాలి: రామ్మోహన్

‘ఇండిగో’ కార్యకలాపాల్లో అంతరాయం వల్ల నెలకొన్న పరిస్థితులను విమానయాన శాఖ&DGCA నిరంతరం పర్యవేక్షిస్తోందని కేంద్రమంత్రి రామ్మోహన్ తెలిపారు. సోమవారం రాత్రి కూడా సీనియర్ అధికారులతో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించినట్లు చెప్పారు. ఎయిర్‌లైన్స్ పనితీరు, అందిస్తున్న సేవలు తెలుసుకునేందుకు ఎయిర్‌పోర్టులను సందర్శించాలని అధికారులను ఆదేశించామన్నారు. లోపాలుంటే వెంటనే సరిదిద్దాలని చెప్పినట్లు ట్వీట్ చేశారు.


