News February 11, 2025
ఏపీలో అక్షరాస్యత రేటు ఎంతంటే?

APలో అక్షరాస్యత రేటు 67.5%గా ఉందని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. గత మూడేళ్లలో అక్షరాస్యత రేటు పెంపునకు ఎలాంటి చర్యలు తీసుకున్నారని వైసీపీ ఎంపీ తనూజారాణి అడిగిన ప్రశ్నకు లోక్సభలో కేంద్ర మంత్రి జయంత్ చౌదరి సమాధానం ఇచ్చారు. 2023-24లో దేశంలోని గ్రామీణ ప్రాంతాల్లో అక్షరాస్యత 77.5%గా ఉండగా, ఏపీలో 67.5%గా ఉందన్నారు. పీఎం కౌశల్ యోజన కింద రాష్ట్రానికి రూ.48.42కోట్లు మంజూరు చేశామని తెలిపారు.
Similar News
News September 17, 2025
‘అయ్యప్ప’ అంటే అర్థం ఇదే!

అయ్యప్ప స్వామి హరిహర పుత్రుడు. అయ్య అంటే విష్ణువును సూచించే అయ్యన్ అని, అప్ప అంటే శివుడిని సూచించే అప్పన్ అని అర్థం వస్తుంది. ఈ రెండు పదాల కలయికతోనే ఆయనకు అయ్యప్ప అనే పేరు వచ్చింది. ఆయనను ధర్మశాస్తా, మణికంఠుడు అని కూడా పిలుస్తారు. మహిషాసురిడి సోదరి అయిన మహిషిని సంహరించి అయ్యప్ప ధర్మాన్ని నిలబెడతాడు. శబరిమల క్షేత్రంలో కొలువై ఉంటాడు. భక్తులు ఇక్కడికి దీక్షతో వెళ్లి ఆయన ఆశీస్సులు పొందుతారు.
News September 17, 2025
మిల్క్ బ్యాంక్ అంటే ఏమిటి..?(1/2)

మిల్క్ బ్యాంక్ తల్లి పాల దాతల నుంచి పాలను సేకరిస్తుంది. ప్రసవానంతరం మహిళలు వారి బిడ్డలకు పాలు ఇవ్వగా, మిగిలిన పాలను మిల్క్ బ్యాంక్లో డొనేట్ చేస్తారు. ఫార్ములా పాలతో పోల్చి చూస్తే పాశ్చరైజ్డ్ డోనర్ పాలకు పోషక విలువలు ఎక్కువ. ముందుగా పాలల్లో సూక్ష్మ క్రిములు ఉన్నాయేమో చెక్ చేసి తర్వాత పాలను పాశ్చరైజ్ చేసి, నిల్వ చేస్తారు. తల్లిపాలు లభ్యంకాని శిశువులకు డోనర్ పాలను మిల్క్ బ్యాంక్ పంపిణీ చేస్తుంది.
News September 17, 2025
తల్లిపాలు దానం చేయడానికి ఎవరు అర్హులంటే..(2/2)

తల్లిపాలు దానం చేయాలంటే ఏ రకమైన ఇన్ఫెక్షన్లూ లేవని రక్తపరీక్షల ద్వారా నిర్ధారించుకోవాలి. తన బిడ్డకు పాలు తాగించిన తర్వాత, డొనేట్ చేయగలిగినన్ని పాలు ఉంటే దానం చేయవచ్చు. పొగాకు, డ్రగ్స్, ఆల్కహాల్, ఎక్కువ కెఫీన్ తీసుకొనే అలవాటు ఉన్నవారు, HIV, HTLV, హెపటైటిస్ B, C, సిఫిలిస్ ఇన్ఫెక్షన్ ఉన్న తల్లులు బ్రెస్ట్ మిల్క్ డొనేట్ చేయకూడదు. అవయవ, కణజాల మార్పిడి చేయించుకున్న వారు దానం చేయడానికి అనర్హులు.