News October 20, 2024

మెయిన్స్ పరీక్ష వాయిదా వేస్తే నష్టమేంటి: శ్రీనివాస్ గౌడ్

image

TG: గ్రూప్-1 మెయిన్స్ పరీక్ష వాయిదా వేస్తే వచ్చే నష్టమేంటని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ప్రశ్నించారు. అభ్యర్థుల్ని నిర్బంధిస్తూ పరీక్షలు నిర్వహించడం అవసరమా? అని ప్రశ్నించారు. వారికి న్యాయం జరిగే వరకు బీఆర్ఎస్ అండగా ఉంటుందని తెలిపారు. కేంద్రమంత్రి బండి సంజయ్ పొలిటికల్ జోకర్‌గా మారారని విమర్శించారు. మోదీకి ముగ్గురు తమ్ముళ్లని.. పెద్దోడు రేవంత్, నడిపోడు బండి, చిన్నోడు అరవింద్ అని ఎద్దేవా చేశారు.

Similar News

News October 20, 2024

భారత ఆకాశ మార్గం పూర్తి సురక్షితం: BCAS

image

ఇండియా మీదుగా ప్రయాణించే విమానాలకు వరుసగా బాంబు <<14395087>>బెదిరింపులు<<>> రావడంపై బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీ(BCAS) స్పందించింది. భారత ఆకాశ మార్గం సురక్షితంగా ఉందని, ప్రయాణికులకు ఎలాంటి భయం అవసరం లేదని స్పష్టం చేసింది. బాంబు <<14372371>>బెదిరింపులపై<<>> భద్రతా సంస్థలతో సమన్వయం చేసుకుంటున్నామని, త్వరలోనే అల్లరి మూకలకు చెక్ పెడతామని BCAS డీజీ జుల్ఫికర్ హసన్ తెలిపారు.

News October 20, 2024

మార్క్‌ఫెడ్ ద్వారా మొక్కజొన్న కొనుగోలు

image

TG: మార్క్‌ఫెడ్ ద్వారా మొక్కజొన్నలు కొనుగోలు చేస్తున్నట్లు ఆ సంస్థ ఛైర్మన్ మార గంగారెడ్డి, MD శ్రీనివాస్ రెడ్డి వెల్లడించారు. బహిరంగ మార్కెట్‌లో మొక్కజొన్న ధర పడిపోవడంతో రైతులను ఆదుకునేందుకు ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. నాఫెడ్ తరఫున జగిత్యాల, నిర్మల్ జిల్లాతో పాటు ఇతర ప్రాంతాల్లో 12 కేంద్రాలు ప్రారంభించామని తెలిపారు. కాగా మొక్కజొన్నకు మద్దతు ధర రూ.2,225 ఉండగా మార్కెట్లో రూ.2వేలు పలుకుతోంది.

News October 20, 2024

రేపే గ్రూప్-1 పరీక్ష.. నేడు కీలక ప్రకటన!

image

TG: గ్రూప్-1 మెయిన్స్ వాయిదా వేయాలనే డిమాండ్ నేపథ్యంలో అభ్యర్థుల సందేహాలు తీర్చేందుకు ప్రభుత్వం నేడు మీడియాతో సమావేశం నిర్వహించనుంది. పరీక్ష వల్ల ఏ ఒక్క అభ్యర్థి నష్టపోకుండా తీసుకోవాల్సిన చర్యలపై నిన్న అధికారులతో మంత్రులు పొన్నం ప్రభాకర్, శ్రీధర్ బాబు, రాజనర్సింహ, కొండా సురేఖ చర్చించారు. ఈ నేపథ్యంలో ఇవాళ కీలక ప్రకటన చేసే అవకాశం ఉంది. మరోవైపు రేపటి నుంచి పరీక్షలు ప్రారంభం కానున్నాయి.