News April 1, 2024

కచ్చతీవు ద్వీపం వ్యవహారం ఏంటి?

image

ఎన్నికల ప్రచారంలో తాజాగా ప్రధాని మోదీ కచ్చతీవు ద్వీపం వ్యవహారంపై విరుచుకుపడ్డారు. 1974లో అప్పటి ప్రధాని ఇందిరా గాంధీ ఈ ద్వీపాన్ని శ్రీలంకకు ఇవ్వడాన్ని గుర్తు చేశారు. అప్పగింతకు ముందు 1968లోనే ఈ భూభాగాన్ని తమ మ్యాప్‌లో చూపించిన శ్రీలంక ప్రధానితో ఇందిర మాట్లాడటం రాజకీయంగా దుమారం రేపింది. అలా 285ఎకరాల ద్వీపాన్ని సముద్ర ఒప్పందం కింద అప్పగించడం ఇప్పుడు తమిళనాడు రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది.

Similar News

News October 6, 2024

సికింద్రాబాద్ నుంచి గోవా ట్రైన్ ప్రారంభం.. షెడ్యూల్ ఇదే

image

సికింద్రాబాద్-వాస్కోడగామా-సికింద్రాబాద్ రైలు(17039)ను కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ప్రారంభించారు. ఈ రైలు ప్రతి బుధవారం, శుక్రవారం సికింద్రాబాద్ నుంచి.. ప్రతి గురువారం, శనివారం వాస్కోడగామా నుంచి బయల్దేరుతుంది. కాచిగూడ, షాద్ నగర్, జడ్చర్ల, MBNR, గద్వాల్, కర్నూల్ సిటీ, డోన్, గుంతకల్, బళ్లారి, హోస్పేట్, కొప్పల్, హుబ్బలి, లోండా, కులేం, మడ్గాన్ తదితర స్టేషన్లలో ఆగుతుంది. పూర్తి షెడ్యూల్ పై ఫొటోలో చూడండి.

News October 6, 2024

18 మంది సైబర్ నేరగాళ్లు అరెస్ట్

image

TG: HYD సైబర్ క్రైమ్ పోలీసులు పలు రాష్ట్రాల్లో ఆపరేషన్ నిర్వహించి 18 మంది సైబర్ నేరగాళ్లను అరెస్టు చేశారు. రూ.5 లక్షల నగదు, 26 ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. వీరి బ్యాంక్ ఖాతాల్లోని రూ.1.61 కోట్లను సీజ్ చేశారు. తెలంగాణలో రూ.6.94 కోట్లు దోచేసిన ఈ నిందితులపై దేశవ్యాప్తంగా 400కిపైగా కేసులున్నాయి. సీబీఐ, ఈడీ కేసులు, డ్రగ్స్, కొరియర్, పెట్టుబడుల పేరుతో ప్రజలను మోసగించి, బెదిరించి డబ్బులు వసూలు చేశారు

News October 6, 2024

దీపావళికి నిఖిల్ ‘అప్పుడో ఇప్పుడో ఎప్పుడో’

image

సుధీర్ వర్మ డైరెక్షన్‌లో నిఖిల్ హీరోగా నటిస్తున్న మూవీ అప్డేట్‌ను మేకర్స్ వెల్లడించారు. ఆ చిత్రానికి ‘అప్పుడో ఇప్పుడో ఎప్పుడో’ టైటిల్‌ను రివీల్ చేస్తూ ఓ పోస్టర్‌ను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ దీపావళికి రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ మూవీలో రుక్మిణీ వసంత్, దివ్యాంశ కౌశిక్ హీరోయిన్లుగా నటిస్తున్నారు.