News December 6, 2024
‘RAPO22’లో రామ్ పాత్ర పేరు ఏంటంటే..

రామ్ పోతినేని 22వ సినిమా షూటింగ్ మొదలైంది. మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ ఈ విషయాన్ని ట్విటర్లో వెల్లడించింది. ‘మీకు సుపరిచితుడు.. మీలో ఒకడు.. మీ సాగర్’ అంటూ సైకిల్ పక్కన రామ్ నిల్చుని ఉన్న పోస్టర్ను రిలీజ్ చేసింది. ‘రాపో22’గా వ్యవహరిస్తున్న ఈ మూవీకి టైటిల్ ఖరారు చేయాల్సి ఉంది. పి. మహేశ్ బాబు దర్శకత్వం వహిస్తున్నారు. నటీనటులు, సాంకేతిక నిపుణుల పేర్లను త్వరలోనే విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది.
Similar News
News December 19, 2025
ఎల్లుండి భారత్, పాక్ మధ్య ఫైనల్ మ్యాచ్

U19 మెన్స్ ఆసియా కప్లో భారత్, పాకిస్థాన్ ఫైనల్కు చేరాయి. సెమీ ఫైనల్-1లో శ్రీలంకపై భారత్, సెమీస్-2లో బంగ్లాదేశ్పై పాక్ గెలిచాయి. ఈ నెల 21న ఫైనల్ మ్యాచ్ జరగనుంది. సెమీ ఫైనల్-1లో తొలుత SL 138-8 స్కోర్ చేయగా, IND 18 ఓవర్లలో ఛేదించింది. ఆరోన్ జార్జ్ 58, విహాన్ 61 పరుగులతో రాణించారు. SF-2లో ఫస్ట్ BAN 121 రన్స్కు ఆలౌట్ కాగా, పాక్ 16.3 ఓవర్లలో టార్గెట్ను ఛేదించింది.
News December 19, 2025
కాకి లెక్కలతో క్యాన్సర్ కట్టడి ఎలా?

దేశంలో ఏటా 10 లక్షల మంది క్యాన్సర్తో చనిపోతున్నారు. కానీ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య గ్యాప్స్తో వ్యాధి, బాధితులపై సరైన లెక్కలు లేవు. సమగ్ర డేటా ఉంటే బడ్జెట్, మెడిసిన్, ఆస్పత్రుల నిర్మాణం, కంట్రోల్ కోసం చర్యలను స్పష్టంగా టార్గెట్ చేయొచ్చు. ప్రస్తుత కాకి లెక్కలతో కట్టడి కష్టమే. దీంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దీన్ని ‘కచ్చితంగా గుర్తించదగ్గ వ్యాధి’గా ప్రకటించాలని SC ఇటీవలే ఆదేశించింది.
News December 19, 2025
ఐదో టీ20: టాస్ ఓడిన భారత్

అహ్మదాబాద్ వేదికగా భారత్తో జరుగుతోన్న ఐదో టీ20లో సౌతాఫ్రికా టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. టీమ్ ఇండియాలో హర్షిత్, గిల్, కుల్దీప్ స్థానాల్లో బుమ్రా, శాంసన్, సుందర్ వచ్చారు.
IND: సూర్య(C), శాంసన్, అభిషేక్, తిలక్, పాండ్య, జితేశ్, సుందర్, దూబే, వరుణ్, బుమ్రా, అర్ష్దీప్


