News March 26, 2024

సీనియర్ నటి రాధిక ఆస్తుల విలువ ఎంతంటే?

image

లోక్‌సభ ఎన్నికల్లో BJP తరఫున బరిలోకి దిగుతున్న సీనియర్ నటి రాధిక నామినేషన్ పత్రాలను సమర్పించారు. తన ఆస్తుల విలువ రూ.53.45 కోట్లుగా ప్రకటించారు. 75 తులాల బంగారం, 5 కేజీల వెండి ఆభరణాలు, వస్తువులతో కలిపి రూ.27.05 కోట్ల చరాస్తులు ఉన్నట్లు పేర్కొన్నారు. వీటితో పాటు రూ.26.40 కోట్ల స్థిరాస్తులతో పాటు రూ.14.79 కోట్ల అప్పులు ఉన్నాయని వెల్లడించారు. ఆమె తమిళనాడులోని విరుదునగర్ నుంచి బరిలో ఉన్నారు.

Similar News

News April 6, 2026

జూన్ నుంచి మరింత తక్కువ ధరకు ఇన్సూరెన్స్?

image

IRDAI డెవలప్ చేసిన బీమా సుగమ్ పోర్టల్‌లో జూన్ నుంచి జీరో కమీషన్ ఇన్సూరెన్స్ అందుబాటులోకి రానున్నట్లు తెలుస్తోంది. ఏజెంట్లతో పనిలేకుండా ఇన్సూరెన్స్‌ సంస్థలు ఈ పోర్టల్‌కు కేవలం 5-7% ఫీజు చెల్లిస్తే సరిపోతుంది. ఫలితంగా ప్రీమియమ్స్ కూడా తగ్గే అవకాశం ఉంది. JUNలో వెహికల్ ఇన్సూరెన్స్ లాంచ్ కానుంది. ఇక AUGలో హెల్త్ ఇన్సూరెన్స్, SEPలో టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్ అందుబాటులోకి రానున్నట్లు తెలుస్తోంది.

News April 6, 2026

60 ఏళ్ల వరకే బీమా.. ప్రభుత్వం సంప్రదింపులు!

image

TG: రూ.5 లక్షల <<19431944>>బీమా<<>> పథకానికి సంబంధించిన మార్గదర్శకాలను ప్రభుత్వం రూపొందిస్తోంది. కాగా ఇలాంటి బీమా 60 ఏళ్ల వయసు వరకే వర్తిస్తుందని జీవిత బీమా సంస్థల నుంచి సర్కారుకు సమాచారం అందింది. అయితే అన్ని వయసుల వారికి వర్తింపజేసే అవకాశం ఏదైనా ఉందా? అనే విషయంపై ఆర్థిక శాఖ అధికారులు వివిధ బీమా సంస్థలతో సంప్రదింపులు జరుపుతున్నారు. 2026-2027 బడ్జెట్‌లో ఈ కొత్త పథకం కోసం రూ.4,000 కోట్లు కేటాయించారు.

News April 6, 2026

జమిలి ఎన్నికలకు రంగం సిద్ధమైందా?

image

UCC(యూనిఫామ్ సివిల్ కోడ్), జమిలి ఎన్నికలకు కేంద్రం సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఈ రెండు అంశాలపై తీవ్రంగా చర్చలు జరుగుతున్నాయని, మంచి పురోగతి కనిపిస్తోందని ఇవాళ BJP వార్షికోత్సవంలో ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు. ఇప్పటికే నియోజకవర్గాల పునర్విభజనకూ గ్రీన్ సిగ్నల్ లభించింది. త్వరలో జనగణన మొదలుకానుంది. ఈ పరిణామాలన్నింటినీ పరిశీలిస్తే త్వరలోనే కీలక ప్రకటన వెలువడే అవకాశం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు.