News August 10, 2024

భార‌త్‌లో సింహాల సంఖ్య ఎంత‌?

image

2024 నాటికి భారతదేశంలో సుమారు 674 ఆసియా సింహాలు ఉన్నట్టు నివేదిక‌లు చెబుతున్నాయి. 1968లో ఇవి 177 మాత్రమే ఉండేవి. గత దశాబ్దాల్లో చేపట్టిన పునరావాసం – పరిరక్షణ చర్యల వల్ల సింహాల సంఖ్య‌ గణనీయంగా పెరిగింది. ఇవి ప్రధానంగా గుజరాత్‌లోని గిర్ అడవులు సహా పరిసర ప్రాంతాల్లో నివసిస్తున్నాయి.

Similar News

News December 6, 2025

విమానానికి బాంబు బెదిరింపు.. తీవ్ర కలకలం

image

TG: ఢిల్లీ-హైదరాబాద్ ఎయిరిండియా విమానంలో బాంబు పెట్టామంటూ వచ్చిన ఈ-మెయిల్ తీవ్ర కలకలం రేపింది. వెంటనే ఫ్లై‌ట్‌ను శంషాబాద్ ఎయిర్పోర్టులో ల్యాండ్ చేయగా దాని చుట్టూ ఫైర్ ఇంజిన్లను సిద్ధం చేశారు. బాంబ్ స్క్వాడ్స్ ప్రయాణికులను దించేసి తనిఖీలు చేపట్టారు. ప్యాసింజర్లు లగేజ్‌ను ఎయిర్పోర్ట్ సిబ్బందికి హ్యాండోవర్ చేయాలని ఆదేశించారు. ఈ ఫ్లైట్‌లో పలువురు ప్రముఖులు ఉన్నట్లు సమాచారం.

News December 5, 2025

పవనన్నకు థాంక్స్: లోకేశ్

image

AP: చిలకలూరిపేట ZPHSలో నిర్వహించిన మెగా PTM 3.Oకు హాజరైన డిప్యూటీ సీఎం పవన్‌కు మంత్రి లోకేశ్ కృతజ్ఞతలు తెలిపారు. ‘హైస్కూలు లైబ్ర‌రీకి పుస్త‌కాలు, ర్యాక్‌లు, 25 కంప్యూట‌ర్లు అందిస్తామ‌ని ప్ర‌క‌టించిన ప‌వ‌న‌న్న‌కు ధ‌న్య‌వాదాలు. ఏపీ మోడ‌ల్ ఆఫ్ ఎడ్యుకేష‌న్ ద్వారా మ‌న విద్యావ్య‌వ‌స్థ‌ను 2029 నాటికి దేశంలోనే నంబర్ వ‌న్‌గా తీర్చిదిద్దేందుకు Dy.CM అందిస్తున్న స‌హ‌కారం చాలా గొప్పది’ అని ట్వీట్ చేశారు.

News December 5, 2025

వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డుల్లోకెక్కిన సీఎం నితీశ్

image

బిహార్ CM నితీశ్ కుమార్ అరుదైన ఘనత సాధించారు. ఇటీవల పదోసారి CMగా ప్రమాణ స్వీకారం చేయడంతో ఆయన పేరు వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌(లండన్)లో చేరినట్లు JDU తెలిపింది. 2000లో తొలిసారి CM అయిన నితీశ్ వారం రోజులే పదవిలో ఉన్నారు. తర్వాత 2005 నుంచి వరుసగా 5సార్లు సీఎం అయ్యారు. సంకీర్ణ ప్రభుత్వంలో విభేదాలతో పలుమార్లు రాజీనామాలు చేసి మళ్లీ ముఖ్యమంత్రి పీఠం అధిష్ఠించారు.