News June 6, 2024
AP& TGలో నోటా ఓట్ల సంఖ్య ఎంతంటే?

దేశవ్యాప్తంగా వెలువడిన లోక్సభ ఎన్నికల ఫలితాల్లో మొత్తం 63,72,220 ఓట్లు నోటా(నన్ ఆఫ్ ది ఎబౌ)కు వచ్చినట్లు ఈసీ ప్రకటించింది. ఇందులో అత్యధికంగా బిహార్లో 8,97,323 ఓట్లు నమోదయ్యాయి. ఇందులో తెలంగాణలోని 17 స్థానాల్లో మొత్తం 1,02,654 మంది ఓటర్లు (0.47% మంది) నోటాకు జై కొట్టారు. ఇక ఏపీలో నోటా ఓట్ల సంఖ్య 3,98,777. ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థుల్లో ఎవరూ నచ్చకపోతే నోటాను ఎంచుకుంటారు.
Similar News
News September 17, 2025
24న శ్రీవారి ప్రత్యేక దర్శనం టికెట్లు విడుదల

AP: డిసెంబర్ కోటాకు సంబంధించి తిరుమల శ్రీవారి ప్రత్యేక దర్శన టికెట్లు ఈనెల 24న ఉదయం 10గంటలకు విడుదల కానున్నాయి. మ.3 గంటలకు అదే నెలకు సంబంధించిన వసతి బుకింగ్ కూడా ఓపెన్ కానుంది. భక్తులు దళారులను నమ్మవద్దని, <
News September 17, 2025
నటికి రూ.530 కోట్ల రెమ్యూనరేషన్ ఆఫర్?

హాలీవుడ్ నటి సిడ్నీ స్వీనీకి బాలీవుడ్ నుంచి భారీ ఆఫర్ వచ్చినట్లు వార్తలొస్తున్నాయి. హయ్యెస్ట్ బడ్జెట్తో రూపొందనున్న ఓ సినిమాలో నటించేందుకు ఆమెకు ఏకంగా రూ.530కోట్ల ఆఫర్ ఇచ్చినట్లు సినీవర్గాలు తెలిపాయి. అంతర్జాతీయ ప్రేక్షకులను ఆకర్షించేందుకు మేకర్స్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే దీనిపై ఇంకా అధికారిక ప్రకటన లేదు. ఇది జరిగితే అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకున్న నటిగా సిడ్నీ నిలువనున్నారు.
News September 17, 2025
MLC తీన్మార్ మల్లన్న కొత్త పార్టీ

TG: రాష్ట్రంలో మరో కొత్త పార్టీ ఆవిర్భవించింది. MLC చింతపండు నవీన్(తీన్మార్ మల్లన్న) ‘తెలంగాణ రాజ్యాధికార పార్టీ’(TRP) పేరుతో రాజకీయ పార్టీని ప్రకటించారు. హైదరాబాద్లోని ఓ హోటల్లో పలువురు బీసీ ప్రతినిధులతో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఈ ప్రకటన చేశారు. ఆత్మగౌరవం, అధికారం, వాటా అనే నినాదాలతో పార్టీ ఆవిర్భవించినట్లు మల్లన్న తెలిపారు. వచ్చే అన్ని ఎన్నికల్లో TRP పోటీ చేస్తుందని వెల్లడించారు.