News July 27, 2024

గత ఐదేళ్లలో విదేశాల్లో చనిపోయిన విద్యార్థుల సంఖ్య ఎంతంటే?

image

గత ఐదేళ్లలో 633 మంది విద్యార్థులు విదేశాల్లో చనిపోయినట్లు విదేశాంగ శాఖ వెల్లడించింది. పార్లమెంటు సమావేశాల్లో కేరళ ఎంపీ కొడికున్నిల్ సురేశ్ అడిగిన ప్రశ్నకు మంత్రి కీర్తి వర్ధన్ సింగ్ సమాధానమిచ్చారు. అత్యధికంగా కెనడా(172), యూఎస్(108)లో చనిపోయారని పేర్కొన్నారు. పలు హింసాత్మక ఘటనల్లో 19 మంది కన్నుమూసినట్లు తెలిపారు. అవాంఛనీయ ఘటనల్లో ఆతిథ్య దేశాలు దర్యాప్తు చేసి బాధ్యులను శిక్షిస్తున్నాయన్నారు.

Similar News

News October 29, 2025

BELలో 340 ఉద్యోగాలు.. దరఖాస్తు చేశారా?

image

భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్(BEL) 340 ప్రొబేషనరీ ఇంజినీరింగ్ పోస్టులకు దరఖాస్తులు కోరుతోంది. BE, B.Tech, BSc(Eng) ఫస్ట్ క్లాస్‌లో పాసైనవారు NOV 14వరకు అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థుల గరిష్ఠ వయసు 25 ఏళ్లు. రిజర్వేషన్ గలవారికి ఏజ్‌లో సడలింపు ఉంది. అప్లికేషన్ ఫీజు రూ.1180, SC/ST/ PwBDలకు ఫీజు లేదు. రాత పరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. *మరిన్ని ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం <<-se_10012>>జాబ్స్ <<>>కేటగిరీకి వెళ్లండి.

News October 29, 2025

జీవిత సత్యం.. తెలుసుకో మిత్రమా!

image

జీవిత సత్యాన్ని తెలుసుకోవడానికి ఆసుపత్రి, జైలు, శ్మశానాన్ని సందర్శించాలని స్పిరిచ్యువల్, లైఫ్ కోచెస్ సూచిస్తున్నారు. ఆసుపత్రిలో ఆరోగ్యం విలువ, జైలులో ఒక తప్పుడు నిర్ణయం జీవితాన్ని ఎలా మారుస్తాయో తెలుస్తుంది. శ్మశానంలో ధనిక, పేద తేడా లేకుండా అందరూ ఒకే నేలలో కలిసిపోతారు. చివరికి మనం మిగిల్చిపోయే జ్ఞాపకాలు, మనతో తీసుకెళ్లే పశ్చాత్తాపాలే ముఖ్యమని ఈ మూడు వివరిస్తాయని చెబుతున్నారు. దీనిపై మీ కామెంట్.

News October 29, 2025

డేటా లీక్.. వెంటనే పాస్‌వర్డ్స్ మార్చుకోండి!

image

భారీ డేటా ఉల్లంఘనలో 183 మిలియన్లకు పైగా ఈమెయిల్ పాస్‌వర్డ్‌లు లీక్ అయినట్లు AUS సైబర్‌ సెక్యూరిటీ నిపుణుడు ట్రాయ్ హంట్ ధ్రువీకరించారు. వీటిలో Gmail ఖాతాల వివరాలు కూడా ఉన్నాయి. మాల్‌వేర్ ద్వారా దొంగిలించిన లాగిన్ ఐడీలతో మొత్తం 3.5 టెరాబైట్ల (875 HD సినిమాలకు సమానం) డేటాను హ్యాకర్స్ రూపొందించారు. మీ ఖాతా వివరాలు లీక్ అయ్యాయో లేదో తనిఖీ చేసుకుని, వెంటనే పాస్‌వర్డ్‌లు మార్చుకోవాలని ట్రాయ్ సూచించారు.