News August 30, 2025

రోడ్డు ప్రమాదాల్లో తెలుగు రాష్ట్రాల స్థానమిదే..

image

దేశంలో 2023లో 4.80 లక్షల రోడ్డు ప్రమాదాలు జరిగితే 1.72 లక్షల మంది మరణించగా, 4.62 లక్షల మంది గాయపడ్డారని కేంద్ర నివేదిక వెల్లడించింది. 2022తో పోలిస్తే ప్రమాదాలు 4.1%, మరణాలు 2.61% పెరిగాయని పేర్కొంది. రాష్ట్రాల వారీగా రోడ్డు ప్రమాదాల్లో ఏపీ(8,276), TG(8,103) ఏడు, ఎనిమిది స్థానాల్లో, మరణాల్లో AP(3,806), తెలంగాణ(3,508) 8, 9 స్థానాల్లో ఉన్నాయి. మరణాల్లో అత్యధికం 35-45 ఏళ్ల వారే ఉన్నారని తెలిపింది.

Similar News

News August 30, 2025

అల్లు అర్జున్ ఇంట్లో విషాదం

image

అల్లు అర్జున్ ఇంట్లో విషాదం నెలకొంది. ఆయన నానమ్మ, అల్లు అరవింద్ తల్లి, అల్లు రామలింగయ్య భార్య కనకరత్నం(94) ఇవాళ అర్ధరాత్రి దాటాక 1.45 గంటలకు వృద్ధాప్య సమస్యలతో కన్నుమూశారు. విషయం తెలియడంతో బన్నీ ముంబై నుంచి HYDకు బయల్దేరారు. ఆమె చిరంజీవికి అత్త కాగా రామ్‌చరణ్‌కు అమ్మమ్మ. దీంతో మైసూరులో ఉన్న చెర్రీ HYDకు వస్తున్నారు. ఇవాళ మధ్యాహ్నం కోకాపేటలో కనకరత్నం అంత్యక్రియలు జరగనున్నాయి.

News August 30, 2025

ఏపీకి వస్తున్నాం.. IBM ప్రకటన

image

AP: అమరావతిలో క్వాంటమ్ వ్యాలీ టెక్‌పార్క్‌లో క్వాంటమ్ కంప్యూటర్ సెంటర్ పెడుతున్నట్లు దిగ్గజ IT సంస్థ IBM ప్రకటించింది. 2026 మార్చి నాటికి దీనిని ప్రారంభించనున్నట్లు సంస్థ ప్రతినిధి క్రౌడర్ ప్రకటించారు. క్వాంటమ్ కంప్యూటింగ్‌లో భారత్ బలమైన శక్తిగా ఎదుగుతుందని, భవిష్యత్తులో ఈ రంగంపై ఎక్కువ పరిశోధనలు చేయాలని ఆయన అన్నారు. ప్రస్తుతం USA, జపాన్, కెనడా, ద.కొరియాలో IBM క్వాంటమ్ కంప్యూటర్ సెంటర్లు ఉన్నాయి.

News August 30, 2025

ఎల్లో అలర్ట్.. ఈ జిల్లాల్లో వర్షాలు

image

TG: రాష్ట్రంలో ఇవాళ ఆదిలాబాద్, కొత్తగూడెం, హనుమకొండ, జగిత్యాల, భూపాలపల్లి, కామారెడ్డి, కరీంనగర్, ఆసిఫాబాద్, మహబూబాబాద్, మంచిర్యాల, మెదక్, ములుగు, నిర్మల్, నిజామాబాద్, పెద్దపల్లి, సిరిసిల్ల, వరంగల్ జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు కురుస్తాయని IMD ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఖమ్మం, నల్గొండ, సూర్యాపేటలో ఈదురుగాలులతో కూడిన వానలు పడుతాయని పేర్కొంది.