News March 16, 2025
KG చికెన్ ధర ఎంతంటే?

తెలుగు రాష్ట్రాల్లో గత వారంతో పోలిస్తే చికెన్ రేట్లు కాస్త పెరిగాయి. హైదరాబాద్ నగరంలో కేజీ స్కిన్ లెస్ చికెన్ గత వారం రూ.160-180గా ఉండగా ఇప్పుడు రూ.180-200 పలుకుతోంది. కామారెడ్డిలో రూ.160గా ఉంది. అటు ఏపీలోని కర్నూలులో రూ.180, అంబేడ్కర్ కోనసీమ జిల్లా రామచంద్రాపురం, పిఠాపురంలో రూ.220కి విక్రయిస్తున్నారు. మరి మీ ఏరియాలో చికెన్ రేట్లు ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి.
Similar News
News November 28, 2025
చిరంజీవి ఛారిటబుల్ ట్రస్ట్‌కు విదేశీ ఫండ్స్.. కేంద్రం గ్రీన్‌సిగ్నల్

చిరంజీవి ఛారిటబుల్ ట్రస్ట్‌కు విదేశీ విరాళాలు తీసుకునే అవకాశాన్ని కల్పిస్తున్నట్టు అధికారులు వెల్లడించారు. CCT కింద బ్లడ్, ఐ బ్యాంక్‌ను 27 ఏళ్లుగా చిరంజీవి నిర్వహిస్తున్నారు. విదేశీ విరాళాల నియంత్రణ చట్టం 2010 ప్రకారం విదేశీ విరాళాలు తీసుకునేందుకు FCRA అనుమతి కోరుతూ ట్రస్ట్ చేసిన అభ్యర్థనకు కేంద్రం అంగీకారం తెలిపింది. ట్రస్ట్ సేవలు విస్తృతమవుతాయని మెగా అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
News November 28, 2025
పిల్లలకు రాగిజావ ఎప్పుడివ్వాలంటే?

పసిపిల్లల్లో జీర్ణవ్యవస్థ రోజురోజుకూ వృద్ధి చెందుతుంటుంది. అందుకే తేలిగ్గా జీర్ణమయ్యే రాగిజావను 6-8 నెలల మధ్యలో అలవాటు చేయొచ్చంటున్నారు నిపుణులు. ఈ సమయానికల్లా పిల్లల్లో చాలావరకూ తల నిలబెట్టడం, సపోర్టుతో కూర్చోవడం లాంటి మోటార్ స్కిల్స్ డెవలప్ అయి ఉంటాయి కాబట్టి వాళ్లు ఆ రుచినీ, టెక్‌స్చర్‌నీ గ్రహిస్తారు. మొదట తక్కువ పరిమాణంతో మొదలుపెట్టి, అలవాటయ్యే కొద్దీ పరిమాణం పెంచుకుంటూ వెళ్లొచ్చు.
News November 28, 2025
మన ఆత్మలోనే వేంకటేశ్వరుడు

పూతాత్మా పరమాత్మా చ ముక్తానాం పరమాగతిః|
అవ్యయః పురుషః సాక్షీ క్షేత్రజ్ఞో క్షర ఏవ చ||
విష్ణుమూర్తి ఆత్మ స్వరూపుడు. ముక్తి పొందిన జీవులకు శాశ్వత గమ్యం ఆయనే. ఆ దేవుడు ప్రతి శరీరంలో ఉంటాడు. లోపల జరిగే ప్రతి విషయాన్ని సాక్షిగా చూస్తుంటాడు. కానీ, మనం ఎక్కడెక్కడో వెతుకుతుంటాం. ఆ దేవుడు బయటెక్కడో లేడు, మన అంతరాత్మలోనే ఉన్నాడని ఈ శ్లోకం వివరిస్తోంది. ఆయనే మోక్షాన్ని ఇస్తాడని నమ్మకం. <<-se>>#VISHNUSAHASRANAMAM<<>>


