News August 24, 2025

కేజీ చికెన్ ధర ఎంతంటే?

image

తెలుగు రాష్ట్రాల్లో చికెన్ ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. ఏపీలోని విజయవాడలో స్కిన్ లెస్ చికెన్ కేజీ రూ.230, గుంటూరు, నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో రూ.180గా ఉంది. అటు హైదరాబాద్‌లో రూ.190-200, వరంగల్‌లో రూ.210 వరకు విక్రయిస్తున్నారు. మరి మీ ఏరియాలో చికెన్ ధరలు ఎలా ఉన్నాయి? కామెంట్ చేయండి.

Similar News

News August 24, 2025

ట్యాక్స్ పేయర్స్ అత్యధికంగా ఉన్న టాప్-10 రాష్ట్రాలివే!

image

ఇన్‌కమ్ ట్యాక్స్ డేటా (FY 2024-25) ప్రకారం దేశంలో అత్యధిక శాతం పన్ను చెల్లింపుదారులున్న (వార్షిక ఆదాయం ₹12L-₹50L) రాష్ట్రాల్లో కర్ణాటక (20.6%) తొలి స్థానంలో ఉంది. ఆ తర్వాతి స్థానాల్లో వరుసగా TG(19.8), ఝార్ఖండ్(19.5), TN(18.8), ఢిల్లీ (17.6), పుదుచ్చేరి(17.4), ఒడిశా(16.8), MH(16.2), AP(15.9), ఉత్తరాఖండ్(14.2) ఉన్నాయి. కాగా రిచ్ స్టేట్‌గా పేరొందిన గుజరాత్(7%) ఈ లిస్టులో Top-10లో లేకపోవడం గమనార్హం.

News August 24, 2025

airtel ఇంటర్నెట్ డౌన్.. యూజర్ల ఇబ్బందులు

image

airtel మొబైల్, బ్రాడ్‌బాండ్ సేవలు ఉదయం 11 గంటల నుంచి నిలిచిపోయాయని యూజర్లు ఫిర్యాదులు చేస్తున్నారు. కాల్స్ చేసుకోవడానికి నెట్‌వర్క్ పని చేస్తున్నా నెట్ వాడేందుకు వీలు కావట్లేదంటున్నారు. చాట్ చేసేందుకూ ఇబ్బంది పడుతున్నామని చెబుతున్నారు. కొందరు మొబైల్ రీస్టార్ట్ చేసి ప్రయత్నిస్తున్నారు. దీనిపై airtel స్పందించాల్సి ఉంది. మీకూ ఈ సమస్య ఎదురవుతోందా? కామెంట్ చేయండి.

News August 24, 2025

DVT అంటే ఏంటో తెలుసా?

image

Deep Vein Thrombosis (<<17502186>>DVT<<>>) బారిన పడితే రక్తనాళాల్లో రక్తం గడ్డకడుతుంది. ఇది సాధారణంగా కాళ్లలోని లోతైన సిరల్లో ఏర్పడుతుంది. ఊపిరితిత్తుల వరకు చేరుకుంటే Pulmonary Embolismకు దారి తీస్తుంది. దీంతో ఊపిరితిత్తులకు రక్తప్రవాహం ఆగి, ఆక్సిజన్ తగ్గుతుంది. ప్రాణాలకు ముప్పు వాటిల్లవచ్చు. హార్మోనల్ పిల్స్, ఎక్కువ సేపు కూర్చోవడం, సర్జరీ తర్వాత యాక్టివ్‌గా ఉండకపోతే DVT రిస్క్ పెరుగుతుందని డాక్టర్లు తెలిపారు.