News August 31, 2025

కేజీ చికెన్ ధర ఎంతంటే?

image

ఏపీలోని విజయవాడలో స్కిన్ లెస్ చికెన్ కేజీ రూ.220గా ఉంది. గుంటూరు, చిత్తూరులో రూ.200 చొప్పున అమ్ముతున్నారు. అటు హైదరాబాద్‌లో రూ.200-220, వరంగల్‌లో రూ.210, ఖమ్మం, నల్గొండలో రూ.220 వరకు విక్రయిస్తున్నారు. కేజీ మటన్ ధర రూ.800 నుంచి రూ.900 మధ్య ఉంది. మీ ఏరియాలో చికెన్, మటన్ రేట్లు ఎలా ఉన్నాయి? కామెంట్ చేయండి.

Similar News

News September 1, 2025

తాజా సినీ ముచ్చట్లు

image

★ ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ ‘డ్రాగన్’లో హీరోయిన్‌గా రుక్మిణీ వసంత్.. ‘మదరాసి’ మూవీ ఈవెంట్‌లో వెల్లడి
★ పవన్ కళ్యాణ్ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ నుంచి ఇవాళ సాయంత్రం 4.45 గంటలకు స్పెషల్ అప్‌డేట్
★ విక్టరీ వెంకటేశ్, వీవీ వినాయక్ కాంబోలో త్వరలో సినిమా?
★ ‘నిన్ను కోరి’, ‘మజిలీ’ సినిమాల డైరెక్టర్ శివ నిర్వాణతో రవితేజ థ్రిల్లర్ మూవీ?

News September 1, 2025

దివ్యాంగులందరికీ పింఛన్ పంపిణీ

image

AP: <<17398848>>నోటీసులతో<<>> సంబంధంలేకుండా సెప్టెంబర్ నెలలో దివ్యాంగులందరికీ పింఛన్ పంపిణీ చేయాలని CM ఆదేశించినట్లు మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. నోటీసులందుకున్న 1.35లక్షల మందిలో 95% మంది అప్పీల్ చేసుకోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. అనర్హులపై రెండ్రోజుల్లో నిర్ణయం తీసుకోనున్నారు. కొత్తగా 7,872 మందికి రూ.4వేలు చొప్పున స్పౌజ్ పింఛన్ మంజూరు చేసినట్లు మంత్రి తెలిపారు. ఇందుకోసం రూ.3.15 కోట్లు రిలీజ్ చేశారు.

News September 1, 2025

తుమ్మిడిహట్టి, మేడిగడ్డపైనే ప్రధాన చర్చ

image

TG: కాళేశ్వరాన్ని తుమ్మిడిహట్టి నుంచి మేడిగడ్డకు మార్చడంపైనే అసెంబ్లీలో ప్రధాన చర్చ జరిగింది. తుమ్మిడిహట్టి వద్ద నీళ్లు అందుబాటులో ఉన్నాయని కేంద్రం చెప్పినా BRS ప్రభుత్వం దోపిడీ చేసేందుకే దాన్ని మార్చిందని సీఎం రేవంత్ ఆరోపించారు. MH అభ్యంతరం కేవలం ఎత్తుపైనే అని తెలిపారు. మేడిగడ్డ వద్ద అదనంగా 120 TMCల లభ్యత ఉందని హరీశ్ రావు తెలిపారు. ఎక్స్‌పర్ట్స్ కమిటీ, CWC సూచన మేరకే నిర్ణయం తీసుకున్నామన్నారు.