News September 7, 2025

కేజీ చికెన్ ధర ఎంతంటే?

image

తెలుగు రాష్ట్రాల్లోని పలు చోట్ల చికెన్ ధరలు స్వల్పంగా పెరిగాయి. గత వారం ఏపీలోని విజయవాడ, గుంటూరులో స్కిన్ లెస్ చికెన్ కేజీ రూ.220 ఉండగా, ఇవాళ రూ.240కి విక్రయిస్తున్నారు. అటు హైదరాబాద్‌, కామారెడ్డిలో రూ.240గా ఉంది. వినాయక నిమజ్జనాలు ముగియడం, ఇవాళ ఆదివారం కావడంతో చికెన్ అమ్మకాలు భారీగా పెరిగే అవకాశం ఉంది.

Similar News

News September 7, 2025

నవరో కామెంట్స్‌ ఫేక్: ‘X’ FACT CHECK

image

‘భారత్ తమ లాభాల కోసం రష్యా ఆయిల్ కొంటోంది’ అన్న US ట్రేడ్ అడ్వైజర్ పీటర్ నవరో వ్యాఖ్యలను ‘X’ ఖండించింది. ‘ఇంధన భద్రత కోసమే భారత్ రష్యా ఆయిల్ కొంటోంది. ఎలాంటి ఆంక్షలు ఉల్లంఘించట్లేదు. రష్యా నుంచి యురేనియం కొంటున్న US.. భారత్‌ని టార్గెట్ చేయడం ద్వంద్వ వైఖరే’ అని పేర్కొంది. దీంతో నవరో ‘X’ అధినేత ఎలాన్ మస్క్‌పై మండిపడ్డారు. వారి ఫ్యాక్ట్ చెక్ ఓ చెత్త అని కొట్టి పారేశారు.

News September 7, 2025

ఆర్చరీలో భారత్ సరికొత్త చరిత్ర

image

సౌత్ కొరియాలో జరుగుతున్న ఆర్చరీ ఛాంపియన్‌షిప్‌లో భారత ఆర్చర్లు సరికొత్త చరిత్ర సృష్టించారు. కాంపౌండ్ మెన్స్ టీమ్ విభాగంలో తొలిసారి ప్రపంచ ఛాంపియన్‌లుగా నిలిచారు. ఫైనల్లో ఫ్రెంచ్ పెయిర్‌పై రిషభ్, ప్రతమేశ్, అమన్‌తో కూడిన భారత జట్టు 235-233 తేడాతో విజయం సాధించింది. దీంతో దేశం తరఫున మొట్టమొదటి బంగారు పతకం కైవసం చేసుకుంది. మరోవైపు కాంపౌండ్ మిక్స్‌డ్‌ ఫైనల్లో జ్యోతిసురేఖ జోడీ ఓడి రజతంతో సరిపెట్టుకుంది.

News September 7, 2025

నేను ఏ పార్టీ కండువా కప్పుకోలేదు: బండ్ల

image

TG: తాను BRSలోనే ఉన్నానని, వేరే ఏ పార్టీ కండువా కప్పుకోలేదని గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి తెలిపారు. తానెప్పుడూ పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడలేదని చెప్పారు. స్పీకర్‌ నోటీస్‌కు సమాధానం ఇచ్చానని, సీఎంను కలిసిన వివరాలు పొందుపరిచానని పేర్కొన్నారు. కాగా BRS నుంచి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లిన ఎమ్మెల్యేలకు నోటీసులు ఇవ్వాలని ఇటీవల సుప్రీంకోర్టు స్పీకర్‌కు సూచించిన విషయం తెలిసిందే.