News January 12, 2025

కేజీ చికెన్ ధర ఎంతంటే?

image

తెలుగు రాష్ట్రాల్లో చికెన్ ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. హైదరాబాద్, ఉమ్మడి కృష్ణా జిల్లాలో స్కిన్ లెస్ చికెన్ రూ.220గా ఉంది. రెండు రాష్ట్రాల్లోని చాలా ప్రాంతాల్లో దాదాపు ఇవే ధరలు ఉన్నాయి. సంక్రాంతి పండగ దగ్గర పడటంతో ఎక్కువ మంది నాటుకోళ్లు కొనేందుకు మొగ్గు చూపుతున్నారు.

Similar News

News February 1, 2026

Apocalypto యాక్టర్ కన్నుమూత

image

ప్రముఖ మెక్సికన్ యాక్టర్ గెరార్డో తరసేనా(55) కన్నుమూశారు. ఆయన మరణానికి గల కారణాలు తెలియరాలేదు. Apocalypto, మ్యాన్ ఆన్ ఫైర్, ది మెక్సికన్ సినిమాలు, నార్కోస్ వెబ్ సిరీస్ ద్వారా ఆయన ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందారు. కెరీర్‌లో దాదాపు 50 చిత్రాలు, టీవీ సిరీస్‌లలో నటించారు.

News February 1, 2026

నిద్రలేమితో హెయిర్ ఫాల్

image

నిద్ర లేమి వల్ల శరీరంలో కార్టిసోల్ అనే ఒత్తిడి హార్మోన్ స్థాయి పెరుగుతుంది. ఈ హార్మోన్ స్థాయి పెరిగినప్పుడు.. అది నేరుగా జుట్టు ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది. అధిక కార్టిసోల్ జుట్టు కుదుళ్లకు రక్త ప్రసరణను తగ్గిస్తుంది. దీని కారణంగా.. కుదుళ్లకు సరైన పోషణ అందక జుట్టు రాలడం మొదలవుతుంది. అంతేకాకుండా అసంపూర్తి నిద్ర జుట్టును బలహీనపరచడమే కాకుండా.. తల చర్మాన్ని కూడా పాడు చేస్తుందని నిపుణులు చెబుతున్నారు.

News February 1, 2026

బనారస్ హిందూ యూనివర్సిటీలో ఉద్యోగాలు

image

<>బనారస్ <<>>హిందూ యూనివర్సిటీలో 21 పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. అర్హతగల అభ్యర్థులు ఫిబ్రవరి 17వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి PhD(సాయిల్ సైన్స్& అగ్రికల్చర్ కెమిస్ట్రీ, జియోగ్రఫీ), డిప్లొమా జియో ఇన్ఫర్మాటిక్స్, డిగ్రీ, MSc(అగ్రికల్చర్), MA(జియోగ్రఫీ), BSc(అగ్రికల్చర్) అర్హతతో పాటు పని అనుభవం ఉండాలి. ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://www.bhu.ac.in