News April 6, 2025
కేజీ చికెన్ ధర ఎంతంటే?

తెలుగు రాష్ట్రాల్లో పలు చోట్ల చికెన్ ధరలు తగ్గాయి. హైదరాబాద్ నగరంలో గత వారం స్కిన్ లెస్ చికెన్ కేజీ రూ.280 ఉండగా నేడు రూ.230గా ఉంది. విజయవాడలో కేజీ రూ.310 నుంచి రూ.270కి తగ్గింది. బర్డ్ ఫ్లూతో ఏపీలో ఓ చిన్నారి మృతి చెందిందన్న వార్తల ప్రభావం ధరలపై చూపినట్లు తెలుస్తోంది. మరోవైపు ఇవాళ శ్రీరామనవమి సందర్భంగా చాలా మంది నాన్-వెజ్ తినేందుకు ఇష్టపడట్లేదు.
Similar News
News November 19, 2025
వేమనపల్లిలో విషాదం.. అనాథలైన ముగ్గురు చిన్నారులు

వేమనపల్లి మండలంలో విషాదం నెలకొంది. తల్లిదండ్రులను కోల్పోయి ఇద్దరు కుమారులు, ఒక కూతురు అనాథలయ్యారు. ఆరేళ్ల క్రితం కరోనా మహమ్మారి సమయంలో తండ్రిని కోల్పోయిన ముగ్గురు చిన్నారులు.. ఇప్పుడు రోడ్డు ప్రమాదంలో తల్లిని కోల్పోయారు. వరుసగా జరిగిన ఈ రెండు దుర్ఘటనలు ఆ కుటుంబ భవిష్యత్తును చీకటిలోకి నెట్టేశాయి. ముగ్గురు చిన్నారుల అనాథ స్థితి అందరిని ఆందోళనకు గురిచేస్తోంది.
News November 19, 2025
మావోయిస్టుల కథ ముగిసినట్టేనా?

‘ఆపరేషన్ కగార్’తో మావోయిస్టు సెంట్రల్ కమిటీ మెంబర్లు ఒక్కొక్కరిగా హతం అవుతున్నారు. 5 నెలల్లో ఐదుగురు సభ్యులు మృతి చెందారు. వారిలో సుధాకర్, బాలకృష్ణ, రామచంద్రారెడ్డి, సత్యనారాయణ రెడ్డి, అంజు దాదా ఉన్నారు. మల్లోజుల వేణుగోపాల్, ఆశన్న, చంద్రన్న తదితర కీలక సభ్యులు లొంగిపోయారు. పలువురు ప.బెంగాల్లో ఆశ్రయం పొందుతున్నట్లు సమాచారం. తాజాగా హిడ్మా మృతితో కేంద్ర నాయకత్వం మరింత బలహీనపడింది.
News November 19, 2025
సినిమాలకు రిటైర్మెంట్ ప్రకటించిన నటి తులసి

సినీ నటి తులసి యాక్టింగ్కు రిటైర్మెంట్ ప్రకటించారు. ఈ ఏడాది డిసెంబర్ 31న షిర్డీకి వెళ్తున్నానని, ఆరోజు నుంచి సినిమాలకు దూరమై మిగిలిన జీవితాన్ని సాయిబాబాకు అంకితం చేస్తానని ఆమె పేర్కొన్నారు. తులసి 4వ ఏట నుంచి నటనా ప్రస్థానాన్ని మొదలెట్టారు. తెలుగుతో పాటు ఇతర భాషల్లో సుమారు 300 సినిమాలు చేశారు. ‘శంకరాభరణం’లో బాలనటిగా మంచి గుర్తింపు పొందారు. యువ హీరోలకు తల్లి పాత్రల్లోనూ కనిపించి మెప్పించారు.


