News November 30, 2024
‘పుష్ప-2’ ఒక్క టికెట్ ధర ఎంతంటే?

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన ‘పుష్ప-2’ సినిమా టికెట్ బుకింగ్స్ తెలంగాణలో మరికొన్ని క్షణాల్లో ప్రారంభం కానుంది. పెరిగిన ధరలతో ఒక్కో టికెట్ ధర థియేటర్లను బట్టి మారుతుంటుంది. మల్టీప్లెక్స్‌లో ఒక్కో టికెట్ రేటు రూ.531, సింగిల్ స్క్రీన్స్‌లో రూ.354, ప్రీమియర్ షోలకు రూ.1200గా ఉండనున్నట్లు తెలుస్తోంది. తొలి మూడు రోజులు మాత్రమే ఈ ధరలుండగా.. ఆ తర్వాత టికెట్ ధరల్లో వ్యత్యాసం ఉంటుంది.
Similar News
News December 24, 2025
1.31 లక్షల మంది రైతులకు వ్యవసాయ పరికరాలు: తుమ్మల

TG: విపక్ష నేతల మాటలతో యాప్ అమలులో లేని జిల్లాల్లో రైతులు యూరియా ఎక్కువ కొంటున్నట్లు తమ దృష్టికి వచ్చిందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పేర్కొన్నారు. ఎరువులపై విపక్షం దుష్ప్రచారం చేస్తోందని మండిపడ్డారు. త్వరలో రాష్ట్రమంతా యాప్ అమలు చేస్తామన్నారు. CM ఆదేశాలతో రైతు యాంత్రీకరణ పథకాన్ని పునరుద్ధరిస్తున్నట్లు చెప్పారు. దీనిద్వారా 1.31 లక్షల మంది రైతులకు వ్యవసాయ పరికరాలను సబ్సిడీపై అందిస్తామని చెప్పారు.
News December 24, 2025
BLO, సూపర్వైజర్ల రెమ్యునరేషన్ భారీగా పెంపు

AP: BLO, సూపర్వైజర్లకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. EC ఆదేశాల మేరకు వారి హానరేరియమ్ భారీగా పెంచుతూ GO ఇచ్చింది. యాన్యువల్ రెమ్యునరేషన్‌ను BLOలకు ₹6000 నుంచి ₹12000లకు పెంచింది. BLO సూపర్వైజర్లకు ₹12000 నుంచి ₹18000లకు పెంచుతున్నట్లు ప్రకటించింది. స్పెషల్ సమ్మరీ రివిజన్, సమ్మరీ రివిజన్లలో పాల్గొన్న వారికి అదనంగా మరో ₹2000 అందించనుంది. 2025 ఆగస్టు నుంచి ఇది అమలవుతుందని పేర్కొంది.
News December 24, 2025
Money Tip: మీ జీతంలో EMIల వాటా ఎంత?

ప్రతినెలా సంపాదించే మొత్తంలో అప్పుల వాటా ఎంత ఉండాలో చెప్పేదే 40% EMI రూల్. ఇంటి అద్దె, తిండి, ఇతర ఖర్చులు పోనూ.. చేతికి వచ్చే ఆదాయంలో 40 శాతానికి మించి EMIలు ఉండకుండా చూసుకోవాలి. లేదంటే మీరు ఆర్థికంగా ఇబ్బందుల్లో పడతారు. హోం, పర్సనల్, కార్ లోన్లు.. అన్నీ కలిపి ఈ పరిమితిలోపే ఉండాలి. అప్పుల భారం తగ్గించుకుంటేనే ప్రశాంతంగా ఉండగలరు. పొదుపు పెంచుకోవడానికి ఈ సూత్రం ఎంతో ఉపయోగపడుతుంది.


