News September 27, 2024
డిక్లరేషన్ ఇవ్వడానికి జగన్‌కు ఇబ్బంది ఏంటి?: సీఎం

AP: బైబిల్ చదువుతానని చెప్పిన YS జగన్‌కు తిరుమలలో డిక్లరేషన్ ఇవ్వడానికి ఇబ్బంది ఏంటని సీఎం చంద్రబాబు ప్రశ్నించారు. ‘అన్య మతస్థులు ఎవరు వచ్చినా తిరుమలలో డిక్లరేషన్ ఇవ్వాల్సిందే. ఎన్నో ఏళ్లుగా డిక్లరేషన్ అనేది ఉంది. CMగా ఉన్నప్పుడు ఆయన్ను ఎవరూ అడ్డుకోలేదు. అప్పుడు చేసినట్లుగా ఇప్పుడూ చేస్తానంటే ఎలా? చట్టాలు, సంప్రదాయాలను గౌరవించడంలో సీఎం మొదటి వ్యక్తిగా ఉండాలి’ అని సీఎం సూచించారు.
Similar News
News December 25, 2025
₹1.5లక్షల కోట్ల ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఏర్పాటు దిశగా అడుగులు

AP: రాష్ట్రంలో ₹1.5 లక్షల కోట్ల ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఏర్పాటు దిశగా అడుగులు పడుతున్నాయి. మారిటైమ్ బోర్డు ద్వారా 20 MOUల్లో 14 అమల్లోకి వచ్చాయని స్పెషల్ CS కృష్ణబాబు వెల్లడించారు. ‘వీటిలో ₹10వేల CR విలువైనవి 3 ఉన్నాయి. APDC ద్వారా ₹10వేల కోట్ల విలువైన 5 ప్రాజెక్టులు ఏర్పాటు కానున్నాయి. GMR ఏరోసిటీ, మూలపేట పోర్టు, పల్నాడు, సత్యసాయి, కర్నూలు ప్రాంతాల్లో ఏరోస్పేస్ ప్రాజెక్టులు రానున్నాయి’ అని తెలిపారు.
News December 25, 2025
జైలర్ నటుడు ఆస్పత్రిపాలు

నటుడు వినాయకన్ ఆస్పత్రి పాలైన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ‘ఆడు-3’ షూటింగ్‌లో స్టంట్లు చేస్తుండగా ఆయన గాయపడ్డారు. వెంటనే కొచ్చిలోని ఆస్పత్రికి తరలించగా MRI స్కాన్‌లో మెడ, భుజంలోని నరాలు, కండరాలకు డ్యామేజ్ జరిగినట్లు తేలింది. దీంతో 6 వారాల పాటు బెడ్ రెస్టు తీసుకోవాలని వైద్యులు సూచించారు. జైలర్ సినిమాతో పాపులర్ అయిన ఆయన మద్యం మత్తులో <<15212135>>పలుమార్లు<<>> రచ్చ చేసిన విషయం తెలిసిందే.
News December 25, 2025
ESIC మెడికల్ కాలేజీ& హాస్పిటల్, రాంచీలో ఉద్యోగాలు

<


