News October 25, 2024
ఇళ్లు కూల్చడం దేనికి? ఆ పనులు చేయండి చాలు: ఈటల

TG: మూసీ ప్రక్షాళన విషయంలో ప్రభుత్వం ఇష్టానుసారం వ్యవహరిస్తోందని బీజేపీ నేత ఈటల రాజేందర్ మండిపడ్డారు. ‘అసలు DPR లేకుండా మార్కింగ్ ఎలా చేస్తారు. చెరువులు శుభ్రం చేసి, డ్రైనేజీ నీరు మూసీలో కలవకుండా చూడండి. అంతేకానీ పేదల ఇళ్లు కూల్చడం దేనికి? గత ప్రభుత్వం సచివాలయాన్ని బఫర్ జోన్లో కట్టలేదా? పేదల ఉసురు మంచిదికాదు. కూల్చివేతలకు ఉపక్రమిస్తే బుల్డోజర్లకు అడ్డంగా పడుకుంటాం’ అని హెచ్చరించారు.
Similar News
News October 26, 2025
ఏపీలో నిర్మలా సీతారామన్ పర్యటన వాయిదా

AP: రాష్ట్రంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పర్యటన వాయిదా పడింది. ఎల్లుండి అమరావతిలో ఒకేసారి 12 బ్యాంకులకు శంకుస్థాపన చేసేందుకు ఆమె రేపు రాష్ట్రానికి రావాల్సి ఉంది. కానీ మొంథా తుఫాన్ కారణంగా మంత్రి పర్యటన వాయిదా పడినట్లు అధికారులు వెల్లడించారు. తదుపరి తేదీ త్వరలో ప్రకటిస్తామని చెప్పారు.
News October 26, 2025
మహిళల కోసం మెప్మా కొత్త కార్యక్రమాలు

ఏపీలో లక్షమంది మహిళలను పారిశ్రామికవేత్తలుగా తయారుచేసే లక్ష్యంతో ప్రభుత్వం కొత్త కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది. MEPMA ద్వారా చేపట్టే 8 కార్యక్రమాలు మహిళ పారిశ్రామిక వేత్తలకు మార్గదర్శకం కానున్నాయి. పారిశ్రామిక వేత్తలుగా రాణించేందుకు, ప్రోత్సహించేందుకు అవసరమైన సమాచార పుస్తకాలు ప్రభుత్వం రూపొందించింది. వీటిని మహిళా సాధికారత, డిజిటల్ శిక్షణ, స్థిరమైన జీవనోపాధిని ప్రోత్సహించే లక్ష్యంతో రూపొందించారు.
News October 26, 2025
WC జర్నీ.. RO-KO ఆడే సిరీస్లు ఎన్నంటే?

AUS సిరీస్ 3వ వన్డేలో భారత స్టార్ ప్లేయర్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ 2027 వరల్డ్ కప్ వరకు కొనసాగుతామన్న సంకేతాలిచ్చారు. అప్పటి వరకు మరో 8 వన్డే సిరీస్ల్లో RO-KO షో చూసే అవకాశముంది. సౌతాఫ్రికా, న్యూజిలాండ్, అఫ్గానిస్థాన్, WI, శ్రీలంకతో స్వదేశంలో, ఇంగ్లండ్, బంగ్లాదేశ్, న్యూజిలాండ్తో ఆయా దేశాల్లో టీమ్ఇండియా 3 మ్యాచ్ల సిరీస్లు ఆడనుంది. వీటితో పాటు ఆసియా కప్లోనూ వీరు మెరిసే అవకాశముంది.


