News October 20, 2025
దీపావళికి, గుడ్లగూబకు సంబంధమేంటి?

దీపావళి రోజున లక్ష్మీదేవిని పూజిస్తారన్న విషయం తెలిసిందే! ఆ అమ్మవారి వాహనమే గుడ్లగూబ. అందుకే నేడు ఆ పక్షిని చూస్తే శుభం కలుగుతుందని చెబుతుంటారు. అయితే ఉత్తర భారతదేశంలో ఈ పక్షిని బలిస్తే మంచి జరుగుతుందని నమ్ముతారు. కానీ ఇది మూఢ నమ్మకమేనని పండితులు చెబుతున్నారు. ఈ నమ్మకాలను ఆసరాగా చేసుకొని గుడ్లగూబ వేటగాళ్లు అక్రమ వ్యాపారం చేసి డబ్బు సంపాదించడం కోసం ఇలాంటి దుష్ప్రచారాన్ని సృష్టించార’ని అంటున్నారు.
Similar News
News October 20, 2025
మెరిసే చర్మం కోసం ఈ ఫేస్ ప్యాక్‌లు

అందంగా కనిపించాలని ఎవరికి ఉండదు చెప్పండి. దీనికోసం ఇంట్లోనే ఉండే కొన్నిపదార్థాలతో ఈ ప్యాక్స్ ట్రై చేసి చూడండి. * పెరుగు, తేనె కలిపి ముఖానికి రాసుకోవాలి. 15 నిమిషాలు ఉంచి మెల్లగా మసాజ్ చేస్తూ కడిగేయాలి. దీంతో ముఖానికి మంచి గ్లో వస్తుంది. * పసుపు, గంధం, పాలు, రోజ్ వాటర్ కలిపి మిక్స్ చేసి ముఖానికి అప్లై చేయాలి. ఈ ప్యాక్ వారానికి రెండుసార్లు వేస్తే ముఖం అందంగా మెరిసిపోతుంది.
News October 20, 2025
కరుడుగట్టిన నేరస్థుడు రియాజ్.. కథ ముగిసింది

TG: నిజామాబాద్ ఎన్‌కౌంటర్‌లో చనిపోయిన రియాజ్ బుల్లెట్ బైకులను చోరీ చేయడంలో దిట్ట అని పోలీసులు వెల్లడించారు. ఇతడిపై 60కి పైగా కేసులున్నాయి. శుక్రవారం కానిస్టేబుల్ ప్రమోద్ ఇతడిని పట్టుకుని బైకుపై తీసుకెళ్తుండగా కత్తితో పొడిచి చంపి పారిపోయాడు. నిన్న పోలీసులు అతడిని పట్టుకున్నారు. ఆ క్రమంలో గాయాలు కావడంతో ఆస్పత్రిలో చేర్చారు. ఇవాళ గన్ తీసుకుని పారిపోతుండగా పోలీసులు జరిపిన కాల్పుల్లో చనిపోయాడు.
News October 20, 2025
BDLలో 110 పోస్టులు

సంగారెడ్డిలోని భారత్ డైనమిక్స్ లిమిటెడ్(BDL) 2025-26 సంవత్సరానికి 110 అప్రెంటిస్ ఖాళీలకు దరఖాస్తులు కోరుతోంది. టెన్త్, ఐటీఐ అర్హతగల అభ్యర్థులు ఈ నెల 30 వరకు www.apprenticeshipindia.gov.in పోర్టల్ ద్వారా అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థులు సాధించిన మార్కుల ఆధారంగా మెరిట్ జాబితా ప్రకటిస్తారు. వెబ్‌సైట్: https://bdl-india.in/