News October 4, 2025
ఏ నామం స్మరిస్తే ఏ ఫలితం ఉంటుంది?

శ్రీరామా! అని స్మరిస్తే విజయం దక్కుతుంది.
దామోదర! అంటే బంధముల నుంచి విముక్తులవుతారు.
నారాయణా! అని జపిస్తే సకల గ్రహ దోషాలు తొలగిపోతాయి.
అచ్యుతా! అని పిలిస్తే ఆహారమే ఔషధం అవుతుంది.
గోవిందా! అని స్మరిస్తే పాపాల నుంచి విముక్తి లభిస్తుంది.
నరసింహా! అంటే మీలో భయం పోతుంది.
కృష్ణా! అని తలచుకుంటే కష్టాలు మాయమవుతాయి.
జగన్నాథా! అంటే ప్రశాంతత లభిస్తుంది.
మాధవా! అని స్ఫురిస్తే పనులు పూర్తవుతాయి.
Similar News
News October 4, 2025
తెలుగు రాష్ట్రాల్లో పెరిగిన మొక్కజొన్న సాగు

AP, తెలంగాణలో ఖరీఫ్ సీజన్‌లో మొక్కజొన్న సాగు విస్తీర్ణం పెరిగిందని కేంద్ర గణాంకాలు వెల్లడించాయి. గత ఏడాది ఇదే సమయానికి 2 రాష్ట్రాల్లో 83.15 లక్షల హెక్టార్లలో మొక్కజొన్న సాగులో ఉండగా.. ఈ ఏడాది 91.89 లక్షల హెక్టార్లకు పెరిగింది. గత ఐదేళ్ల సగటుతో పోలిస్తే 16.3% పెరిగినట్లు కేంద్ర గణాంకాలు పేర్కొన్నాయి. దేశంలో మొక్కజొన్న ఉత్పత్తిలో కర్ణాటక తొలి స్థానంలో ఉండగా.. తెలంగాణ-5, ఏపీ-7వ స్థానాల్లో ఉన్నాయి.
News October 4, 2025
ఈ నెల 10 నుంచి ఓటీటీలోకి ‘మిరాయ్’

కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో తేజా సజ్జ, రితికా నాయక్ జంటగా తెరకెక్కిన ‘మిరాయ్’ మూవీ జియో హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ కానుంది. ఈ నెల 10నుంచి తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడ భాషల్లో అందుబాటులోకి రానున్నట్లు OTT సంస్థ ట్వీట్ చేసింది. సెప్టెంబర్ 5న థియేటర్లలో రిలీజైన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ.150 కోట్లకుపైగా కలెక్షన్లు రాబట్టింది. ఈ మూవీలో మంచు మనోజ్, శ్రియ, జయరామ్, జగపతిబాబు కీలక పాత్రలు పోషించారు.
News October 4, 2025
నన్ను లేడీ ప్రభాస్ అంటారు: శ్రీనిధి శెట్టి

తాను సోషల్ మీడియాలో లో ప్రొఫైల్ మెయింటెన్ చేస్తానని హీరోయిన్ శ్రీనిధి శెట్టి అన్నారు. దాంతో స్నేహితులు తనను లేడీ ప్రభాస్ అని పిలుస్తారని ఓ ఇంటర్వూలో చెప్పారు. అటు త్రివిక్రమ్-వెంకటేశ్ సినిమాలో నటిస్తున్నారనే ప్రచారాన్ని ఆమె ఖండించారు. దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన లేదని, అవకాశం వస్తే యాక్ట్ చేస్తానని తెలిపారు. కాగా సిద్ధూ జొన్నలగడ్డతో శ్రీనిధి నటించిన ‘తెలుసు కదా’ మూవీ ఈ నెల 17న రిలీజ్ కానుంది.