News September 19, 2024

‘దేవర’ రన్ టైమ్ ఎంతంటే?

image

యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ తెరకెక్కించిన ‘దేవర’ ఈనెల 27న రిలీజ్ కానుంది. ఎన్నో అంచనాల మధ్య విడుదలయ్యే ఈ సినిమా టైటిల్ & ఎండ్ క్రెడిట్స్ కాకుండా 2 గంటల 42 నిమిషాల నిడివితో ఉంటుందని సినీ వర్గాలు పేర్కొన్నాయి. ఇప్పటికే రిలీజైన ట్రైలర్ సినిమాపై అంచనాలు పెంచగా మరింత హైప్ ఇచ్చేందుకు మేకర్స్ అన్ని భాషల్లో ఇంటర్వ్యూలు ప్లాన్ చేస్తున్నారు. త్వరలోనే HYDలో మూవీ ప్రీరిలీజ్ వేడుక ఉండే అవకాశం ఉంది.

Similar News

News December 27, 2025

డ్రగ్స్ కేసు ఆడియో, వీడియో సాక్ష్యాలన్నీ ఏమయ్యాయి?: బండి

image

TG: డ్రగ్స్ కేసు KTRకు చుట్టుకొని రాజకీయ జీవితం నాశనం అయ్యేలా ఉండడంతో నాటి CM KCR నీరుగార్చారని కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆరోపించారు. ‘పట్టుబడిన సెలబ్రిటీలు, ఇతరులు KTR డ్రగ్స్ తీసుకున్నట్లు చెప్పారు. ఆడియో, వీడియో సాక్ష్యాలతో SIT చీఫ్ అకున్ నివేదిక ఇచ్చారు. వాటిని నాటి CS సోమేశ్ తీసుకున్నారు. అవి ఏమయ్యాయి? సోమేశ్‌ను విచారించాలి. కేసును మళ్లీ అకున్‌కు అప్పగించాలి’ అని ఓ ప్రకటనలో పేర్కొన్నారు.

News December 27, 2025

కాంగ్రెస్ ఎంపీ పోస్ట్.. BJPకి బూస్ట్

image

కాంగ్రెస్ ఎంపీ దిగ్విజయ్ చేసిన ఓ పోస్ట్ ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. అద్వానీ పాదాల దగ్గర మోదీ కూర్చొన్న ఓ పాత ఫొటోను షేర్ చేస్తూ.. కింద కూర్చొనే సామాన్య కార్యకర్త కూడా CM, PM అయ్యే అవకాశం BJP, RSSలో ఉంటుందన్నారు. దీంతో ఇది పరోక్షంగా రాహుల్ గాంధీకి చురక అంటూ పలువురు సొంతపార్టీ నేతలే అభిప్రాయపడ్డారు. వివాదం ముదరడంతో తాను వ్యవస్థను మెచ్చుకున్నానని BJPని కాదని దిగ్విజయ్ వివరణ ఇచ్చారు.

News December 27, 2025

21ఏళ్లకే మున్సిపల్ ఛైర్మన్.. రికార్డు సృష్టించిన కేరళ యువతి

image

కేరళలో ఇటీవల జరిగిన స్థానిక ఎన్నికల్లో పాలా మున్సిపాలిటీలోని 15వ వార్డు నుంచి 21 ఏళ్ల దియా స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి, విజయం సాధించారు. ఎన్నికల్లో ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీ రాకపోవడంతో, తీవ్రమైన రాజకీయ చర్చల అనంతరం ఆమెను మున్సిపల్ ఛైర్మన్‌గా ఎన్నుకున్నారు. మద్రాస్ క్రిస్టియన్ కాలేజీలో బీఏ ఎకనామిక్స్ చదివిన దియా చైర్‌పర్సన్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తూనే ఉన్నత చదువులు కొనసాగిస్తానని తెలిపారు.