News September 5, 2024
‘దేవర’ మూవీ రన్ టైమ్ ఎంతంటే?

ఈనెల 27న విడుదల కాబోతున్న Jr.NTR దేవర మూవీ రన్ టైమ్ 3 గంటల 10 నిమిషాలు ఉంటుందని వార్తలొస్తున్నాయి. అయితే ఫైనల్ ఎడిట్ అయ్యి, సెన్సార్‌కు సబ్మిట్ చేసే ముందు నిడివి తగ్గొచ్చని సినీవర్గాలు చెబుతున్నాయి. 2 గంటల 47 నిమిషాల రన్ టైమ్ ఉండొచ్చని పేర్కొన్నాయి. దీనిపై మూవీ టీమ్ నుంచి స్పష్టత రావాల్సి ఉంది. ఈ సినిమా నుంచి తాజాగా విడుదలైన ‘దావూదీ’ పాటకు మిక్స్డ్ రియాక్షన్స్ వస్తున్నాయి.
Similar News
News October 14, 2025
పశువుల్లో వ్యాధులు.. మందుల కొరతతో ఇబ్బందులు

AP: గత 2,3 వారాలుగా కురుస్తున్న వర్షాల వల్ల పాడిపశువులు, మేకలు, గొర్రెల్లో వ్యాధుల తీవ్రత పెరిగింది. గిట్టల మధ్య, మూతి దగ్గర పుండ్లు, గొంతువాపు లక్షణాలు కనిపిస్తున్నాయి. వీటి నివారణకు ఇవ్వాల్సిన మందులు స్థానిక పశువైద్యశాలల్లో లేవని.. పాడి రైతులు, గొర్రెలు, మేకల పెంపకందారుల సంఘం ఆరోపించింది. వాటి సరఫరాకు చర్యలు తీసుకోవాలని పశుసంవర్ధకశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిని కలిసి వినతిపత్రం సమర్పించింది.
News October 14, 2025
విశాఖలో మొట్టమొదటి గూగుల్ AI హబ్: సుందర్

డేటా సెంటర్ ఏర్పాటుపై గూగుల్ CEO సుందర్ పిచాయ్ ప్రకటన చేశారు. ‘విశాఖపట్నంలో తొలి ఏఐ హబ్‌కు సంబంధించిన ప్రణాళికపై ప్రధాని మోదీతో మాట్లాడా. ఈ ఏఐ హబ్ కీలక మైలురాయి కానుంది. ఈ కేంద్రంలో గిగావాట్ సామర్థ్యం ఉండే హైపర్ స్కేల్ డేటా సెంటర్, ఇంటర్నేషనల్ సబ్‌సీ గేట్‌వే & భారీ స్థాయి ఇంధన మౌలిక సదుపాయాలను కలిగి ఉంటుంది. దీనిద్వారా AI ఆవిష్కరణలు వేగవంతం చేస్తాం.’ అని Xలో పేర్కొన్నారు.
News October 14, 2025
RSS సమావేశాలపై బ్యాన్‌కు కర్ణాటక CM ఆదేశం

RSS సమావేశాలను ప్రభుత్వ సంస్థలు, స్థలాల్లో నిషేధించేలా చర్యలకు CSను ఆదేశించినట్లు కర్ణాటక CM సిద్దరామయ్య తెలిపారు. TNలో మాదిరిగా రాష్ట్రంలోనూ చర్యలు తీసుకోవాలని మంత్రి ప్రియాంక్ ఖర్గే రాసిన లేఖపై ఆయన స్పందించారు. కాగా RSS మతం పేరిట విద్యార్థుల మనసులను కలుషితం చేస్తోందని ఖర్గే ఆరోపించారు. BJP నేతల పిల్లలు అందులో ఎందుకు ఉండరని ప్రశ్నించారు. ప్రభుత్వ సంస్థల్లో దాని సమావేశాలను అనుమతించబోమన్నారు.