News July 10, 2024

టీమ్ ఇండియా కోచ్ గంభీర్ జీతం ఎంతంటే?

image

టీమ్ ఇండియా హెడ్ కోచ్‌గా గౌతమ్ గంభీర్ సరికొత్త పాత్రలో కనిపించనున్నారు. ఈ క్రమంలో గౌతీ జీతంపై సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. ద్రవిడ్‌కు ఇచ్చిన వేతనం కంటే రెట్టింపు గంభీర్ పొందనున్నారని టాక్. ద్రవిడ్‌కు రూ.12 కోట్లు ఇవ్వగా ఆయనకు రూ.25 కోట్లు ఇవ్వనున్నట్లు వార్తలు వస్తున్నాయి. KKR మెంటార్‌గా కూడా ఆయన రూ.25 కోట్లు అందుకున్నట్లు సమాచారం. డైలీ వేజ్, ఫ్లైట్ ఛార్జీలు, బస ఖర్చులనూ BCCI భరించనుంది.

Similar News

News January 26, 2026

గంటల వ్యవధిలో స్వల్పంగా తగ్గిన గోల్డ్ రేటు

image

హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో బంగారం <<18961013>>ధర<<>> ఉదయంతో పోల్చితే కాస్త తగ్గింది. 24 క్యారెట్ల 10గ్రాముల పసిడి ధర ఉదయం రూ.1,62,710 ఉండగా రూ.760 తగ్గి రూ.1,61,950కు చేరింది. అలాగే 22క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర ఉదయం నుంచి రూ.700 పతనమై రూ.1,48,450 పలుకుతోంది. అటు KG సిల్వర్ రేటు రూ.3,75,000గా ఉంది. రెండు తెలుగు రాష్ట్రాల్లోని వేర్వేరు ప్రాంతాల్లో ధరల్లో స్వల్ప తేడాలున్నాయి.

News January 26, 2026

‘మన శంకరవరప్రసాద్ గారు’ కలెక్షన్లు ఎంతంటే?

image

చిరంజీవి, అనిల్ రావిపూడి కాంబినేషన్లో తెరకెక్కిన ‘మన శంకరవరప్రసాద్ గారు’ భారీ కలెక్షన్లతో దూసుకెళ్తోంది. ఈ మూవీ నిన్నటి వరకు రూ.350 కోట్ల(గ్రాస్)కు పైగా వసూలు చేసింది. నిన్న జరిగిన ఈవెంట్‌లో మేకర్స్ స్పెషల్ పోస్టర్ వేశారు. ఈ సినిమా ఇప్పటికే అత్యధిక వసూళ్లు రాబట్టిన ప్రాంతీయ చిత్రంగా రికార్డు సృష్టించింది. ఈ సినిమాలో నయనతార హీరోయిన్‌గా నటించగా విక్టరీ వెంకటేశ్ స్పెషల్ రోల్ చేశారు.

News January 26, 2026

NZతో చివరి 2 T20లకు తిలక్ దూరం

image

గాయంతో NZతో జరిగిన తొలి 3 T20లకు దూరమైన తిలక్ చివరి 2 మ్యాచులూ ఆడట్లేదని BCCI తెలిపింది. అతని స్థానంలో శ్రేయస్ జట్టులో కంటిన్యూ అవుతారని వివరించింది. అయితే వచ్చే నెల ప్రారంభం కానున్న టీ20 వరల్డ్ కప్‌ నాటికి తిలక్ పూర్తి ఫిట్‌నెస్ సాధిస్తారని క్రీడా వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతం నం.3లో ఇషాన్ ఆడుతుండగా, తిలక్ జట్టులో జాయిన్ అయితే ఆ స్థానంలో ఎవరు బరిలోకి దిగుతారనేది ఆసక్తికరంగా మారింది.