News February 6, 2025

47లక్షల రైతుల పరిస్థితి ఏంటి?: హరీశ్‌రావు

image

తెలంగాణలో 68 లక్షల మంది రైతులుంటే ప్రభుత్వం 21.45 లక్షల మందికి రైతుభరోసా వేసిందని… మిగతా 47 లక్షల అన్నదాతల పరిస్థితి ఏంటని హరీశ్ రావు ప్రశ్నించారు. రైతుభరోసా మెుత్తం తొలుత రూ.7500 అని చెప్పి దానిని రూ.6వేలకే కుదించారన్నారు. ఎకరం లోపు భూమి ఉన్నవారి సంఖ్య గతంతో పోలిస్తే తగ్గిందన్నారు. కాంగ్రెస్ గోరంత చేసి కొండంతగా చెప్పుకుంటుందని తన X ఖాతాలో పోస్ట్ చేశారు.

Similar News

News February 6, 2025

English Learning: Antonyms

image

✒ Humble× Proud, Assertive
✒ Impenitent× Repentant
✒ Hypocrisy× Sincerity, frankness
✒ Indifferent× Partial, Biased
✒ Impulsive× Cautious, Deliberate
✒ Infernal× Heavenly
✒ Indigent× Rich, Affluent
✒ Interesting× Dull, Uninteresting
✒ Insipid× Pleasing, appetizing

News February 6, 2025

దరఖాస్తు గడువు పెంపు

image

AP: రాష్ట్రంలో గీత కార్మికులకు మద్యం దుకాణాల కేటాయింపు దరఖాస్తు గడువును ఈ నెల 8 వరకు ఎక్సైజ్ శాఖ పొడిగించింది. ఈ నెల 10న డ్రా తీసి లబ్ధిదారుల పేర్లను కలెక్టర్లు ప్రకటిస్తారని వెల్లడించింది. రాష్ట్రంలోని 340 మద్యం దుకాణాలను ప్రభుత్వం గీత కార్మికులకు కేటాయించిన విషయం తెలిసిందే.

News February 6, 2025

అమెరికాలో తెలుగోళ్లు ఎంతమంది ఉన్నారంటే?

image

అక్రమ వలసదారులను అమెరికా వారి దేశాలకు తిప్పి పంపుతోంది. వీరిలో తెలుగు రాష్ట్రాలకు చెందినవారూ ఉన్నారు. అమెరికాలో తెలుగు వారు 12.30 లక్షలకుపైగా ఉన్నారు. ఎక్కువగా కాలిఫోర్నియా(2 లక్షలు)లో నివసిస్తున్నారు. ఆ తర్వాత టెక్సాస్(1.50 లక్షలు), న్యూజెర్సీ(1.10 లక్షలు), ఇల్లినాయిస్(83 వేలు), వర్జీనియా(78 వేలు), జార్జియా(52 వేలు)లో ఉన్నారు. అక్కడ హిందీ, గుజరాతీ మాట్లాడే వారి తర్వాత తెలుగు మాట్లాడేవారే ఎక్కువ.

error: Content is protected !!