News June 7, 2024
ఏపీలో వాలంటీర్ల పరిస్థితి ఏంటి?

AP:అఖండ మెజార్టీతో విజయం సాధించిన NDA కూటమి గత ప్రభుత్వంలో నియమించబడిన వాలంటీర్ల విషయంలో ఎలా ముందుకెళ్తుందనే దానిపై ఆసక్తి నెలకొంది. తాము అధికారంలోకి వస్తే వాలంటీర్లకు ₹10వేల వేతనం ఇస్తామని కూటమి నేతలు ప్రచారం చేశారు. రాజీనామా చేసిన వారు పోను 2లక్షల మంది వాలంటీర్లను ఏ విధంగా ఉపయోగిస్తారనే దానిపై చర్చ నడుస్తోంది. వాలంటీర్ల సంఖ్యను తగ్గిస్తారా? కొత్తగా నియమిస్తారా? అనే దానిపై స్పష్టత రావాల్సి ఉంది.
Similar News
News December 3, 2025
స్కూళ్లలోకి అకడమిక్ ఇన్స్ట్రక్టర్లు

AP: టీచర్ల కొరతను అధిగమించేందుకు స్కూళ్లలో అకడమిక్ ఇన్స్ట్రక్టర్లను నియమించనున్నారు. గతంలో పని చేసిన విద్యా వాలంటీర్ల మాదిరే వీరు విధులు నిర్వర్తిస్తారు. ఇటీవల మెగా డీఎస్సీలో పోస్టులు భర్తీ చేసినా పలు స్కూళ్లలో ఇంకా ఖాళీలున్నాయి. మొత్తం 1,146 పోస్టుల్లో ఇన్స్ట్రక్టర్ల నియామకానికి ఉత్తర్వులు విడుదలయ్యాయి. విధుల్లో చేరిన తర్వాత స్కూల్ అసిస్టెంట్లకు నెలకు రూ.12,500, ఎస్జీటీలకు రూ.10వేలు ఇస్తారు.
News December 3, 2025
అకడమిక్ ఇన్స్ట్రక్టర్ల నియామక ప్రక్రియ ఇలా..

AP: మండలస్థాయిలో ఉన్న ఖాళీలపై MEO ప్రకటన చేయనుండగా, ఇవాళ్టి నుంచి 5వ తేదీ వరకు అప్లై చేసుకోవచ్చు. అప్లికేషన్లను MEO ఆఫీసుల్లో సమర్పించాలి. అకడమిక్(75%), ప్రొఫెషనల్(25%) అర్హతల ఆధారంగా మెరిట్ లిస్ట్ తయారవుతుంది. స్థానిక గ్రామాలు, మండలాల వారికి ప్రాధాన్యత ఉంటుంది. ఈ నెల 7వ తేదీలోగా కలెక్టర్ నేతృత్వంలోని కమిటీ ఫైనల్ అర్హుల జాబితాను ఖరారు చేస్తుంది. తర్వాతి రోజు నుంచే విధులకు హాజరవ్వాల్సి ఉంటుంది.
News December 3, 2025
PCOSతో దంత సమస్యలు

పీసీఓఎస్ సమస్య పెరిగినప్పుడు ‘పెరియోడాన్టైటిస్’ అనే చిగుళ్ల సమస్య కూడా వస్తుందంటున్నారు నిపుణులు. దీన్ని నిర్లక్ష్యం చేస్తే దంతాలు వదులవుతాయంటున్నారు. PCOS వల్ల మహిళల్లో ఈస్ట్రోజెన్, ప్రొజెస్టిరాన్ అసమతుల్యత ఏర్పడుతుంది. దీంతో చిగుళ్లలో రోగనిరోధక శక్తి తగ్గి ఇన్ఫెక్షన్లు వస్తాయి. కాబట్టి వైద్యులను సంప్రదిస్తే తగిన మందులతో పాటు ఆహారపుటలవాట్లలో కూడా మార్పులు-చేర్పులు సూచిస్తారని చెబుతున్నారు.


